Bank Jobs : తెలుగు చదవడం, రాయడం మరియు మాట్లాడటం రావాలి.. సొంత జిల్లాలో PNB బ్యాంకులో ఉద్యోగం | Punjab National Bank Local Bank Officer (LBO) Notification 2025 Apply Now
Punjab National Bank Recruitment 2025 Latest Local Bank Officer (LBO) Jobs Notification Apply Now : పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్ట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలుగు భాష వస్తే చాలు.. ఏదైనా డిగ్రీ అర్హతతో సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశం.. మొత్తం పోస్టు 750 ఉన్నాయి. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ https://pnb.bank.in/under రిక్రూట్‌మెంట్/ కెరీర్ ద్వారా 03.11.2025 నుండి 23.11.2025 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) దేశవ్యాప్తంగా 750 ఉద్యోగులు అయితే ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 5 పోస్టులు & తెలంగాణలో 88 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష (LLPT) మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలను బ్యాంకు సెలక్షన్ చేస్తుంది. వయస్సు కనిష్ట 20 ఏళ్లు గరిష్టం 30 ఏళ్లు మధ్య వయసు కలిగి ఉండాలి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. నిరుద్యోగులకి కేంద్ర ప్రభుత్వ బ్యాంకులో పర్మనెంట్ ఉద్యోగం.. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.. దరఖాస్తు రుసుము SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు రూ. 50/- + GST @18% = రూ. 59/- (పోస్టేజ్ ఛార్జీలు మాత్రమే) అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అభ్యర్థులు https://pnb.bank.in/ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Punjab National Bank Local Bank Officer (LBO) Recruitment 2025 Apply 750 Vacancy Overview :
సంస్థ పేరు :: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 750
నెల జీతం : రూ.48,480-85,920/-
వయోపరిమితి :: 30 సంవత్సరాల
విద్య అర్హత :: Any డిగ్రీ
దరఖాస్తు ప్రారంభం :: 03 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 23 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://pnb.bank.in/
»పోస్టుల వివరాలు:
•స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) ఉద్యోగాలు = మొత్తం 750 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత: అభ్యర్థి భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలచే గుర్తింపు పొందిన/ఆమోదించబడిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

»వయోపరిమితి: 23-11-2025 నాటికి 20 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు 30 సంవత్సరాలు నిండకూడదు.

»వేతనం: స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) ఉద్యోగుల కోసం 48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920/- ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమిక వేతనంతో పాటు, బ్యాంకు నిబంధనల ప్రకారం డీఏ, సిసిఏ, హెచ్‌ఆర్‌ఏ/లీజు వసతి, సెలవు ఛార్జీల రాయితీ, వైద్య బీమా, పదవీ విరమణ ప్రయోజనాలు మరియు ఇతర భత్యాలు లభిస్తాయి.
»దరఖాస్తు రుసుము: SC/ST/PwBD కేటగిరీ అభ్యర్థులు రూ. 50/- + GST @18% = రూ. 59/- (పోస్టేజ్ ఛార్జీలు మాత్రమే) & అన్ని ఇతరులు రూ. 1000/- + GST @18% = రూ.1180/- దరఖాస్తు రుసుము ఆన్‌లైన్ చెల్లింపు కోసం బ్యాంకు లావాదేవీ ఛార్జీలను అభ్యర్థి స్వయంగా భరించాలి.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష (LLPT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూకు ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ https://pnb.bank.in/under రిక్రూట్‌మెంట్/ కెరీర్ ద్వారా 03.11.2025 నుండి 23.11.2025 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర దరఖాస్తు విధానాలు ఆమోదించబడవు. అభ్యర్థులు “క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్” లింక్‌పై క్లిక్ చేసి, ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసి తమ దరఖాస్తును నమోదు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 03 నవంబర్ 2025.
•ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ : 23 నవంబర్ 2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here

