AP Government Jobs : జిల్లా కలెక్టర్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయా నోటిఫికేషన్ విడుదల చేశారు
AP WD & CW Department Ayah Recruitment 2025 Latest AP Government Jobs Notification apply now : జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు అంతర్భాగంగా నడుపబడుతున్న మిషన్ వాత్సల్య పథకము క్రింద బాల సదనం (చిల్డ్రెన్ హోం) నందు అయా, డాక్టర్ (పార్ట్ టైమ్), Educator (Part-time) & Art & Craft cum music Teacher (Part-time) ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పార్ట్ టైం ప్రాతిపదికన భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్, అనంతపురం వారు ఉత్తర్వులు జారీ చేయడమైనది.

పోస్టువారీగా విద్య అర్హత వివరాలు
•అయా : శిశువులు మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న అనుభవం ఉండాలి.
•డాక్టర్ (పార్ట్ టైమ్) : కనీసం MBBS పూర్తి చేసి, ప్రాక్టీస్ చేస్తున్న మెడికల్ డాక్టర్ అయి ఉండాలి. పీడియాట్రిక్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ అవసరం. అత్యవసర పరిస్థితుల్లో SAA కి క్రమం తప్పకుండా సమయం ఇవ్వగలగాలి. రూ.9,930/- (పార్ట్ టైమ్) నెల జీతం ఇస్తారు.
•Educator (Part-time) : గణితం మరియు సైన్స్‌లో బి.ఎస్సీ, బి.ఎడ్., 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
•ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ (పార్ట్-టైమ్) : 10వ తరగతి సర్టిఫికేట్, గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎంబ్రాయిడరీ, టైలరింగ్ మరియు హస్తకళలలో డిప్లొమా అంటే మృదువైన బొమ్మల తయారీ, చేతితో తయారు చేసిన పనులు, పెయింటింగ్ మొదలైనవి.


వయస్సు : 25-42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : దరఖాస్తు, జీతం, ఉద్యోగ అర్హతలు మరిన్ని వివరాలు అనంతపురం జిల్లా అధికారిక వెబ్ సైట్ http://ananthapuramu.ap.gov.in నందు 25.10.2025 తేదీ ఉదయం 11.30 నుండి అందుబాటులో ఉండును. అర్హత పత్రములను గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించి దరఖాస్తునకు జతపరచవలెను. అర్హులైన అభ్యర్థుల నుండి పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి, అనంతపురము వారి కార్యాలయము నందు తేది: 26.10.2025 ఉదయం 10.30 గంటల నుండి తేది 04.11.2025 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును.

🛑Notification Pdf Click Here

