KGBV Jobs : రాత పరీక్ష లేకుండా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది
Kasturba Gandhi Balika Vidyalaya Accountant, ANM Job Recruitment 2025 latest KGBV notification Out : రాజన్న సిరిసిల్ల జిల్లా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) లలోని ఖాళీగా ఉన్న అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకు కాంట్రాక్టు పద్ధతిన పనిచేయుటకు అర్హత ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ఎస్ వినోద్ గారు ఒక ప్రకటన తెలియజేశారు. అభ్యర్థులు స్థానికులై ఉండవలెను 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ ఆధారంగా స్థానికత నిర్ధారించబడును 18 నుండి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు.. చాలా మంచి అవకాశం రావడం జరిగింది.. జిల్లాలో 3 అకౌంటెంట్ (Category EWS,BC-B,OC), 2 ANM (Category -BC-B.OC) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (KGBV) లో అకౌంటెంట్ పోస్టులకు కామర్స్ డిగ్రీతో పాటు certificate course in Basic computer skills (MS Word, Excel etc) లేదా B.Com Computers అర్హత కలిగి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వబడును. ఎ.ఎన్. ఎం పోస్టుకు ఇంటర్మీడియట్ తో పాటు ఎ.ఎన్.ఎం. ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదేవిధంగా GNM కోర్సు లేదా B.Sc. Nursing అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వబడును. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగును.
పూర్తి సమాచారం కోసం అధికార వెబ్సైట్ https://rajannasiricilla.telangana.gov.in అందుబాటులో ఉంటాయి. అర్హత మరియు ఆసక్తిగల మహిళా అభ్యర్థులు జిల్లా విద్యాధికారి కార్యాలయం ఎస్- 34 జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సముదాయము, రాజన్న సిరిసిల్ల యందు కింద తెలిపిన తేదీలలో అప్లికేషన్లు సమర్పించగలరు.
ముఖ్యమైన తేదీ వివరాలు
1. నోటిఫికేషన్ విడుదల : 23.10.2025
2. దరఖాస్తుల స్వీకరణ 24.10.2025 to 27.10.2025.
3 తాత్కాలిక మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ప్రదర్శన : 30.10.2025
4. అభ్యంతరాలు స్వీకరణ : 31.10.2025
5. తుది మెరిట్ లిస్ట్ మరియు షార్ట్లిస్ట్ ప్రదర్శన : 03.11.2025
6. సర్టిఫికెట్ వెరిఫికేషన్ : 04.11.2025

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Link Click Here

