SSC Constable 2025 : 10+2 అర్హతతో 7,565 కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం అక్టోబర్ 31 వరకు గడువు పొడిగింపు
SSC Constable 2025 Apply Last Date Extended : కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో భారీగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా దిల్లీ పోలీస్ సర్వీస్లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) 7565 పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. SSC కానిస్టేబుల్ ఉద్యోగుల కోసం అక్టోబర్ 31 వరకు గడువు పొడిగించారు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 4,408 పోస్టులు కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు, 2,496 పోస్టులు కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు, 285 పోస్టులు కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు ఎక్స్ సర్వీస్మెన్ (ఇతరులు), 376 పోస్టుల కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు ఎక్స్ సర్వీస్మెన్ (కమాండో) ఉద్యోగాలు అయితే 7565 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి 20 సెప్టెంబర్ నుంచి 21 అక్టోబర్ చివరి తేదీ ఇవ్వడం జరిగింది కానీ 31 అక్టోబర్ 2025 వరకు గడువు పెంచుతూ అధికారికంగా SSC విడుదల చేసింది.
ఈ ఉద్యోగులకు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ దరఖాస్తు చేసుకోవాలనుకునే జనరల్, ఈడబ్ల్యూఎస్ & ఓబిసి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.100 రూపాయలు చెల్లించాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అయితే నెలకు Pay Level-3 (₹ 21700- 69100/-) మధ్యలో జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా గ్రూప్ సి కి సంబంధించిన ఉద్యోగాలు. అప్లై చేసుకుంటే పర్మినెంట్ ఉద్యోగాలు పొందవచ్చు.

SSC నోటిఫికేషన్ కోసం వయోపరిమితి 01-07-2025 నాటికి 18-25 సంవత్సరాలు. అభ్యర్థులు 02-07-2000 కంటే ముందు మరియు 01-07-2007 తర్వాత జన్మించి ఉండకూడదు. వివిధ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో అనుమతించదగిన సడలింపులు క్రింది విధంగా ఉన్నాయి. ఈ ఉద్యోగులకు ఎంపిక విధానం కంప్యూటర్ బీచ్డ్ ఎగ్జామ్ (CBT), ఫిసికల్ ఇందూరాన్స్ & మీసు్రిమెంట్ టెస్ట్ (PE&MT), మెడికల్ పరీక్ష & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఢిల్లీ పోలీస్ పరీక్ష, 2025 లో కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుష మరియు స్త్రీల ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీని 31.10.2025 వరకు [23:00 గంటల వరకు] పొడిగించాలని నిర్ణయించారు.

🛑Apply Last Date Extended Notice Click Here
🛑Notification PDF Click Here
🛑Apply Online Click Here
🛑Official Website Click Here

