ISRO Recruitment 2025 : 10th అర్హతతో ఇస్రోలో లైబ్రరీ అసిస్టెంట్, ఫైర్‌మెన్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల
ISRO Notification 2025 : మీరు కేవలం 10వ తరగతి పాస్ అయినా అభ్యర్థులకి ఇస్రో గోల్డెన్ చాన్స్ ఇవ్వడం జరిగింది.. ఆసక్తికరమైన అభ్యర్థులు 14 నవంబర్ 2025 చివరి తేదీలోపు apps.shar.gov.in ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) లో భాగమైన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) లో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ ‘A’, రేడియోగ్రాఫర్ ‘A’, టెక్నీషియన్ ‘B’, డ్రాఫ్ట్స్‌మన్ ‘B’, కుక్, ఫైర్‌మెన్ ‘A’, లైట్ వెహికల్ డ్రైవర్ ‘A’, నర్స్-B ఉద్యోగాలకు నియామకాలను ప్రకటించింది. మీరు ఆసక్తికరమైన అభ్యర్థులు ISRO అధికారిక వెబ్‌సైట్ apps.shar.gov.in అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి 14 నవంబర్ 2025 లోపు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి.

పోస్ట్ పేరు మరియు ఖాళీ వివరాలు
ఇస్రోలో సైంటిస్ట్/ఇంజనీర్ = 23
టెక్నికల్ అసిస్టెంట్ = 28
సైంటిఫిక్ అసిస్టెంట్ = 03
లైబ్రరీ అసిస్టెంట్ = 01
రేడియోగ్రాఫర్ = 1
టెక్నీషియన్ = 70
డ్రాఫ్ట్స్‌మన్ = 2
కుక్ = 3
ఫైర్‌మెన్ = 6
లైట్ వెహికల్ డ్రైవర్ = 3
నర్స్-B = 1 తదితర పోస్టులు ఈ ఇస్రో నోటిఫికేషన్ 141 ఖాళీలు అయితే ఉన్నాయి.
ISRO లో నోటిఫికేషన్ లో విద్య అర్హత
ఈ ఇస్రో నోటిఫికేషన్ లో 10వ తరగతి ఉత్తీర్ణత, ITI, ఇంజనీరింగ్ డిప్లొమా, B.Sc./B.A./గ్రాడ్యుయేషన్, B.E./B.Tech అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి, నెల జీతం వివరాలు
14/11/ 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 35 సంవత్సరాలు ఉండాలి. పోస్టును అనుసరించి నెలకు జీతం ₹19,900 నుండి ₹1,77,500/- మధ్యలో ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో ఎంపిక రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, వైద్య పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఇస్రో సెలక్షన్ చేస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి:
దరఖాస్తు చేసుకోవడానికి, ముందుగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) అధికారిక వెబ్‌సైట్ apps.shar.gov.in ని సందర్శించి అర్హులైన అభ్యర్థులు 14 నవంబర్ 2025 లోపు apps.shar.gov.in ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Online Click Here