Railway Jobs : రైల్వే శాఖలో టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Railway RRB NTPC Graduate Station Master Recruitment 2025 Apply Online
Railway RRB NTPC Graduate Recruitment 2025 Latest Railway Ticket Supervisor & Station Master Notification Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. భారత ప్రభుత్వం (రైల్వే మంత్రిత్వ శాఖ) రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) లో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ & సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు నియామకాలు కోసం Any గ్రాడ్యుయేట్ తో 5800 ఉద్యోగుల కోసం ఈనెల 21వ తేదీ నుంచి నవంబర్ 20 లోపల ఆన్లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. దీనికోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB) లో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన అభ్యర్థుల కోసం చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్-161, స్టేషన్ మాస్టర్ -615, గూడ్స్ రైలు మేనేజర్-3423, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-921 & సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 638 పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి RRB NTPC దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఆన్లైన్ లో దరఖాస్తు ప్రారంభ తేదీ 21 అక్టోబర్ 2025 & ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 20 నవంబర్ 2025. వయస్సు (01.01.2026 నాటికి) కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 33 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు http://rrbapply.gov.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

రైల్వే RRB NTPC గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ వయసు, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ (RRB) NTPC గ్రాడ్యుయేట్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలో నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ & సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 సం||రాలకు మించకూడదు.
మొత్తం పోస్ట్ :: 5800
అర్హత :: Any గ్రాడ్యుయేట్ పాస్ చాలు
నెల జీతం :: Level – 6 as per 7 CPC (Rs.35400-112400)
దరఖాస్తు ప్రారంభం :: 21 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 20 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: http://rrbapply.gov.in/
»పోస్టుల వివరాలు: సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, స్టేషన్ మాస్టర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, గూడ్స్ రైలు మేనేజర్ & జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత : 20.11.2025 నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ పూర్తి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలోనే రైల్వే స్టేషన్లో ఉద్యోగం వస్తుంది. ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్లీ రాదు అర్హులు అయితే మీ దగ్గర డిగ్రీ ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
»వయోపరిమితి: వయస్సు (01.01.2026 నాటికి) కనీసం 18 సం||రాలు గరిష్టంగా 30 సం||రాలు మధ్య వయసు కలిగి ఉండాలి దాంతోపాటు గవర్నమెంట్ రూల్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
»వేతనం : పోస్టును అనుసరించి రూ.35,400-1,12,400/- నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: SC/ST/PC/EXSM అభ్యర్థులకు రూ. 250/- & జనరల్/BC/EWS అభ్యర్థులకు ₹500/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఆన్‌లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. రాత పరీక్ష సొంత జిల్లాలో ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు సంబంధిత RRB NTPC http://rrbapply.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లి, “ONLINE” ఎంపికపై క్లిక్ చేయండి, అది కొత్త స్క్రీన్‌ను తెరుస్తుంది. దరఖాస్తును నమోదు చేయడానికి, “క్రొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి” ట్యాబ్‌ను ఎంచుకోండి. మీ దగ్గర Username & Password ఉన్నట్లయితే Enterenter చేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ఆన్-లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 21.10.2025.
•దరఖాస్తు ఆన్-లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ : 20.11.2025.

🛑 Short Notification PDF Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here