No Fee | గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సంస్థలో ఆఫీస్ అసిస్టెంట్ & అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | RSETI Assistant & Attendant Job Recruitment 2025 Apply Now
RSETI (Rural Self-Employment Training Office) Assistant & Attendant Job Notification 2025 : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- RSETI రాజన్న సిరిసిల్ల, ఒప్పంద ప్రాతిపదికన 36 నెలల వ్యవధికి (11 నెలలకు ఒకసారి పనితనమును బట్టి కాంట్రాక్టును తిరిగి రెన్యూవల్ చేయబడును.) RSETI రాజన్న సిరిసిల్లలో నియామకానికి అర్హత కలిగిన అభ్యర్ధుల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

అర్హత ప్రమాణాలు :
అధ్యాపకులు : గ్రాడ్యుయేట్ (ఏదైనా- సైన్స్, కామర్స్, ఆర్ట్స్)/ పోస్ట్ గ్రాడ్యుయేట్, MSW IMA (గ్రామీణాభివృద్ధి). MA (సమాజ శాస్త్రం / సైకాలజి, B.Sc. పశుపోషణ), B.Sc., (హార్టికల్చర్/ వ్యవసాయం/ మార్కెటింగ్). BA తో పాటు B.Ed. ఉన్నవారికి ప్రాధాన్యం. బోధనపై ఆసక్తి ఉండాలి మరియు కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి. స్థానిక భాషలో కమ్యూనికేషన్ నైపుణ్యం తప్పనిసరి, ఇంగ్లీష్ మరియు హిందీలో మాట్లాడగలగటం అదనపు అర్హత స్థానిక భాషలో టైపింగ్ నైపుణ్యం అవసరం. హిందీ/ఇంగ్లీష్ టైపింగ్ అదనపు అర్హత స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లో పని చేసిన అనుభవం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వబడును. వయస్సు పరిమితి: 22-40 సంవత్సరాలు.
ఆఫీస్ అసిస్టెంట్ : గ్రాడ్యుయేట్ అనగా BSW BA/ B.Com డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం స్థానిక భాషలో మాట్లాడటం, రాయటం వచ్చి ఉండాలి. హిందీ/ఇంగ్లీష్ పరిజ్ఞానం అదనపు అర్హత. MS Office (Word and Excel), Tally, స్థానిక భాషలో టైపింట్ తప్పని సరి. ఇంగ్లీష్ టైపింగ్ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం.
అటెండెంట్ : కనీసం వదవ తరగతి పాస్ కావాలి. స్థానిక భాష చదవటం, రాయటం వచ్చే సామర్థ్యం ఉండాలి. వయస్సు పరిమితి: 22-40 సంవత్సరాలు
Watchman : కనీసం 7వ తరగతి పాస్ కావాలి. వ్యవసాయం / తోటల సంరక్షణలో అనుభవం ఉండటం మంచిది.

వయస్సు పరిమితి : 22 to 40 సంవత్సరాలు.
నెలకు జీతం : రూ.12,000/- to రూ.30,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు దిగువ పేర్కొన్న చిరునామాలో ఉన్న RSETI డైరెక్టర్ క్యాంప్ కార్యాలయము నుండి దరఖాస్తు ఫారమ్ సేకరించవచ్చు. * దరఖాస్తుతోపాటు ఈ క్రింది పత్రాలు జత చేయాలి.- వయస్సు, చిరునామా, గుర్తింపు పత్రాల ప్రతులు, – రెండ పోస్బర్ట్ పైజు ఫోటోలు,-KYC డాక్కుమెంట్స్ విద్యా మరియు అనుభవ ధ్రువీకరణ పత్రాల ప్రతులు. దరఖాస్తును సీల్ చేసిన కవర్లో సమర్పించాలి. కవర్‌పై పోస్టు పేరు స్పష్టంగా రాయాలి. ఒక్కొక్క అభ్యర్థి ఒకే పోస్టుకు దరఖాస్తు చేయాలి. బహుళ పోస్టులకు దరఖాస్తు చేస్తే అభ్యర్థిత్వం రద్దయ్యే అవకాశముంది. పూర్తి చేసిన దరఖాస్తును అన్ని అవసరమైన పత్రాలతో కలిపి స్వయంగా అందజేసి. డైరెక్టర్ నుండి స్వీకరణ రశీదు పొందాలి. నమస్తే తెలంగాణ దినపత్రికలో 14-07-2025 రోజు ప్రకటించిన ప్రకటనలో దరఖాస్తులు సమర్పించేందుకు చివరితేది 04-08-2025గా ఉన్నది. దీనిని తేది 17-09-2025 వరకు పొడగించడం జరిగినది
డైరెక్టర్ చిరునామా: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- RSETI రాజన్న సిరిసిల్ల Gopal Nagar Branch, H No.12-5-119, 120 and 121, New Bus Stand Road, Opp: LIC of India, Gopal Nagar, Sircilla-505301.
దరఖాస్తులు సమర్పించేందుకు చివరి తేదీ : 17-09-2025

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

