ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఏ బస్సులో ప్రయాణించవచ్చు ఏ డాక్యుమెంట్ కావాలి | AP Free Bus Stree Shakti Scheme Full Details in Telugu
AP Free Bus Stree Shakti Scheme : రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు పథకం ‘స్త్రీ శక్తి’ ఆగస్టు 15 నుంచి ప్రారంభం. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. 6,700 బస్సులను మహిళల ప్రయాణానికి కేటాయించారు. ఇందుకోసం రూ.1,950 కోట్లు ఖర్చు అవుతుంది. సమర్థంగా పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం. 3 వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు సీఎం ఆదేశించారు. వచ్చే రెండేళ్లలో 1400 ఎలక్ట్రిక్ బస్సులో కొనుగోలు చేస్తాం.
పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తారు.
మహిళలు ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డు ఏదొకటి చూపించాలి. డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు రెండ్రోజుల్లో చేపడతాం. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడతాం మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి ప్రకటించడం జరిగింది.

🔥పల్లెటూరు గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ నోటిఫికేషన్ విడుదల : నిరుద్యోగ గ్రామీణ అభ్యర్థులకు శుభవార్త.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో 5180 జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగుల భర్తీకి 06 ఆగష్టు నుంచి ఈ నెల 26 ఆగష్టు 2025 వరకు https://sbi.co.in/web/careers/Current-openings ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 310, తెలంగాణ లో 250 ఉద్యోగాలు ఉన్నాయి. Any డిగ్రీ, డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వారు అర్హులు. వయసు 20-28 సంవత్సరాలు ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ.750. SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. More Full Notification Details Click Here