One Stop Centre Jobs : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ లో మల్టీ పర్పస్ స్టాఫ్ (Helper) నోటిఫికేషన్ వచ్చేసింది
AP One Stop Centre Multi Purpose staff (Helper) Jobs Notification 2025 : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, వన్ స్టాప్ కేంద్రం, చిత్తూరు నందు ఖాళీగా ఉన్నటువంటి దిగువ తెలుపబడిన పోస్టులకుఎదురుగా చూపబడిన అర్హతల ప్రకారము కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయుటకు గాను అర్హులైన అభ్యర్థుల (BC-C) & (Female candidates only) నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ నియామకములు పూర్తిగా తాత్కాలికము మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు ఉత్తర్వుల మేరకు వారి వారి పనితీరు ఆధారముగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడును.

ఈ నోటిఫికేషన్ లో బహుళార్ధసాధక సిబ్బంది (సహాయకుడు) (మహిళలు మాత్రమే) సంబంధిత రంగంలో పనిచేసిన జ్ఞానం/అనుభవం ఉన్న అక్షరాస్యత ఉన్న ఏ వ్యక్తికైనా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఉన్నత పాఠశాల ఉత్తీర్ణత లేదా తత్సమానం. వయసు 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
01.07.2025 అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంలను https://chittoor.ap.gov.in వెబ్ సైట్ నుండి పొందగలరు. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబందిత దృవీకరణ పత్రములు జతపరచి ఈ నోటిఫికేషన్ ప్రచురితమైన దినము నుండి dt. 07.08.2025సాయంత్రం 5 గంటల లోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము, రెండవ అంతస్తు, అంబేద్కర్ భవనం, కలెక్టరేట్, చిత్తూరు నందు సమర్పించవలయును.
గడువు తేదీ తర్వాత వచ్చినదరఖాస్తులు మరియు అసంపూర్తిగా సమర్పించిన దరఖాస్తులను మరియు సంబందిత దృవీకరణ పత్రములు జతపరచని ఎడల, సదరు దరఖాస్తులను పరిగణలోనికి తీసుకొనబడవు. అర్హతా ప్రమాణాలననుసరించి అర్హులైన అభ్యర్థులకు మాత్రమేఇంటర్వ్యూనకు పిలువబడుదురు. ప్రతిభ ఆధారంగా కుదించబడిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి, నియామకములు జరుపు తేదీ నాటికి అమలులో యున్న/జారీ చేయబడు నిబందనల ప్రకారము జిల్లా ఎంపిక కమిటీ ఆద్వర్యంలో ఈ నియామకములు జరుగును.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here