CBSE 10th, 12th Results 2025 : సీబీఎస్ఈ పరీక్ష 10వ, 12వ తరగతి పరీక్షా ఫలితాల పైన కీలక మార్పులు
CBSE 10th, 12th Results 2025 Date : కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) నిర్వహించిన పదో తరగతి (10వ తరగతి) మరియు పన్నెండో తరగతి (12వ తరగతి) పరీక్షలు ఇటీవలే విజయవంతంగా ముగిశాయి. ఈ పరీక్షల్లో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు విడుదల అవుతాయని మనం తెలుసుకుందాం.
CBSE 10వ, 12వ తరగతి ఫలితాల విడుదలపై తాజా అప్డేట్ రావడం జరిగింది. CBSE 10వ, 12వ తరగతి ఫలితాల విడుదల మే రెండవ వారం లోగా విడుదల అవకాశం ఉంది.

CBSE అధికార వర్గాల ప్రకారం, ఈ ఏడాది 2025కి సంబంధించిన 10వ మరియు 12వ తరగతుల ఫలితాలు మే నెల రెండవ వారం నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఫలితాల విడుదలకు సంబంధించి అధికారిక తేదీ ఇంకా ప్రకటించలేదు. ఫలితాల తేదీ నిర్ధారితమైన వెంటనే CBSE అధికారిక వెబ్‌సైట్లలో వెల్లడవుతుంది.
ఈ సంవత్సరం సుమారు 38 లక్షల మంది విద్యార్థులు CBSE బోర్డుకు సంబంధించిన పరీక్షలు రాశారు. దేశంలోని వివిధ CBSE అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరూ ఈ పరీక్షల్లో పాల్గొన్నారు. అందువల్ల ఫలితాలపై ప్రతి ఒక్కరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
విద్యార్థులు ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసేందుకు CBSE కొన్ని వెబ్‌సైట్లను అందుబాటులో ఉంచింది. అవి:
• https://www.cbse.gov.in/
• https://results.cbse.nic.in/
ఈ వెబ్‌సైట్లలోకి లాగిన్ అయ్యి తగిన వివరాలు నమోదు చేస్తే ఫలితాలు తెలుసుకోవచ్చు.
సీబీఎస్ఈ పరీక్ష 10వ, 12వ తరగతి ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
• ముందుగా CBSE ఫలితాల వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి – results.cbse.nic.in
• మీరు ఏ తరగతికి పరీక్ష రాశారో ఎంపిక చేసుకోండి (10వ లేదా 12వ తరగతి)
• అవసరమైన వివరాలు నమోదు చేయండి – రోల్ నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డ్ నంబర్
• కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను టైప్ చేసి ‘సబ్మిట్’ క్లిక్ చేయండి
• మీ ఫలితాలు స్క్రీన్ పై ప్రదర్శించబడతాయి
• వాటిని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు

CBSE బోర్డు తేల్చిచెప్పింది – ఫలితాల తేదీ గురించి అధికారిక సమాచారం రావేవరకు ఏవిధమైన వదంతులను నమ్మొద్దు. సోషల్ మీడియాలో ప్రచారం అయ్యే అసత్య వార్తల వల్ల విద్యార్థులు గందరగోళానికి లోనయ్యే అవకాశం ఉంది. అందువల్ల, అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని సూచించింది.
ఫలితాలు విడుదలైన తర్వాతే మార్కుల మెమోలు, పాస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఈ సమయంలో విద్యార్థులు తమ ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయాలను సకాలంలో తీసుకోవచ్చు.
విద్యార్థులు లేదా తల్లిదండ్రులకు ఫలితాలపై సందేహాలుంటే CBSE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా సంబంధిత పాఠశాలలతో సంప్రదించవచ్చు.