Inter Admission : ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
Telugu Jobs Point : Telangana inter admission schedule 2025 : తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్మీడియట్ అడ్మిషన్ 2025-26 షెడ్యూల్ విడుదల చేశారు.
30వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల కావడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూల్స్, గురుకుల జూనియర్ కళాశాలలు, కంపోసిట్ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్ షెడ్యూలు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు విడుదల చేశారు.
మే 1వ తేదీ నుంచి అడ్మిషన్ ప్రారంభం కావడం జరుగుతుంది. జూనియర్ కళాశాలలో జూన్ 2వ తేదీ నుంచే క్లాస్ ప్రారంభం కానున్నాయి. మొదటి దశ అడ్మిషన్ జూన్ 30వ తేదీ వరకు ముగిస్తాయని తెలియజేశారు.
తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ద్వారా ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా అధికార వెబ్సైటు https://tgbie.cgg.gov.in/ ద్వారా మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.