Latest Scheme : తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మెగా డిఎస్పి, పై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన
AP Government 2025 : ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న కీలక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన ఏంటి మనం చూసినట్లయితే మెగా DSC, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల పైన కీలక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో వేలాది మంది నిరుద్యోగులు మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. బాపట్ల జిల్లాలో కొత్తగొల్లపాలెంలో ప్రకటించారు. ఈనెల ఆఖరిలో మెగా డిఎస్పి విడుదల చేస్తామని ప్రకటించారు. జూన్… స్కూల్ స్టార్ట్ అయ్యే లోపల కొలువులు ఇస్తామని తెలియజేశారు. అలాగే మే నెలలో ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం ఇస్తామని తెలియజేశారు. ప్రతి విద్యార్థికి 15000 సహాయం చేస్తామని తెలియజేశారు.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా సంవత్సరంలో 20000 అందచేస్తామని సీఎం ప్రకటనలు చేయడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వమే 6000 తో పాటు రాష్ట్ర ప్రభుత్వం 14,000 అందచేస్తామని తెలియజేశారు.