విద్యార్థులకు గుడ్ న్యూస్ : ఈ నెల 15 నుంచి స్కూల్ లో ఒంటిపూట బడులు
Telangana News : తెలంగాణ ప్రభుత్వం మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు, మధ్యాహ్నం వరకే స్కూలు ఉండాలని ప్రభుత్వం సనహద్ధాలు చేస్తుంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లకు ఈ కొత్త సమయం ఉదయం 8 గంటలకు క్లాసులు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు ఉండచ్చని అంచనా. ఈ షెడ్యూల్ ఏప్రిల్ 23 వరకు అమల్లో ఉంటుంది.
అయితే, 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లకు ఈ నిబంధనలు వర్తించవు. టెన్త్ పరీక్షల కారణంగా కొన్ని స్కూళ్లలో మధ్యాహ్నం పూట కూడా క్లాసులు నిర్వహించనున్నారు.

అటు వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 15కి ముందే ఒంటిపూట బడులు ప్రారంభించాలని పేరెంట్స్ కోరుతున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్వరగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
🔥నిరుద్యోగులకు శుభవార్త : అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి పెంపు
🔥ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన