IFBICFRE Recruitment 2025 | రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
Latest IFB ICFRE Field Assistant Notification 2025 : నిరుద్యోగులకు అలర్ట్ ఎందుకంటే మన దేశంలోని అటవీ శాఖలో జాబ్స్ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. వాక్-ఇన్-ఇంటర్వ్యూ భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ICFRE-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ లో కొత్త ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్.
ICFRE-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ 03.02.2025 ఉదయం 10.00 AM నుండి 12.00PM మధ్యలో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ICFRE-IFB వెబ్‌సైట్ (http://ifb.icfre.org)లో అందుబాటులో ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 02
ఖాళీలు వివరాలు: ఫీల్డ్ అసిస్టెంట్
నెల జీతం : రూ. 17000/-నెలకు జీతం వస్తుంది.
ఎంపిక విధానం : తాత్కాలిక ప్రాతిపదికన వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
వయోపరిమితి: ఫీల్డ్ అసిస్టెంట్‌కి గరిష్ట వయో పరిమితి, 01.01.2025 నాటికి 28 సంవత్సరాలు, ఇది 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది
విద్య అర్హత: బయాలజీ/బోటనీ/ఫారెస్ట్రీ/ఎన్విరాన్ మెంటల్ సైన్సెస్/ప్లాంట్ సైన్సెస్‌లో ఫస్ట్ క్లాస్‌తో గ్రాడ్యుయేట్. ఇంగ్లీష్ & తెలుగు భాష మాట్లాడటం, చదవడం & వ్రాయడం రావాలి.
ఎలా దరఖాస్తు చేయాలి :- ఫీల్డ్ అసిస్టెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫారమ్ అనుబంధం-1 (టైప్ చేసిన/పూర్తి చేసిన)లో సక్రమంగా సంతకం చేసి, ఇంటర్వ్యూ తేదీలో సమర్పించాలి.
🛑ఇంటర్వ్యూ చిరునామా : ICFRE-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి (S.O.), హైదరాబాద్-500100.
🔥Date & Time : 03.02.2025 ఉదయం 10.00 AM నుండి 12.00PM
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
ప్రశ్నలు మరియు సమాధానాలు
ప్రశ్న 1: ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి తగిన విద్యార్హత ఏమిటి?
సమాధానం: అభ్యర్థులు బయాలజీ, బోటనీ, ఫారెస్ట్రీ లేదా ప్లాంట్ సైన్సెస్‌లో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ప్రశ్న 2: వయోపరిమితి ఎటువంటి సడలింపు?
సమాధానం: SC/ST/మహిళలు/శారీరక వికలాంగులకు 5 సంవత్సరాలు, OBCలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ప్రశ్న 3: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది?
సమాధానం: ICFRE-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి (ఎస్.ఓ.), హైదరాబాద్-500100.
ప్రశ్న 4: వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ ఏంటి?
సమాధానం: 03.02.2025