Supervisor Jobs : అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త గా 243 అంగనవాడి సూపర్వైజర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Anganwadi Supervisor Notification 2025 | Telugu Jobs Point
CDPO/EO Notification 2025 | Anganwadi Supervisor Notification : రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా భర్తీ చేయనున్నారు.
ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయి?
ఈ 243 పోస్టుల్లో వివిధ స్థాయిల్లో ఖాళీలను ప్రభుత్వం ప్రకటించింది:
• చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో): 61 పోస్టులు
• అసిస్టెంట్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏసీడీపీవో): మహిళా-శిశు సంక్షేమ అధికారి, రీజినల్ మేనేజర్ పోస్టులు
• గ్రేడ్-1 సూపర్వైజర్: 161 పోస్టులు
• శిశు సంరక్షణ కేంద్రాల సూపరింటెండెంట్: 21 పోస్టులు
అంగన్వాడీ సూపర్వైజర్ వేతనం మరియు వయోపరిమితి
ఈ పోస్టులకు వేతన శ్రేణి ₹51,320 నుండి ₹1,27,310 వరకు నిర్ణయించారు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
అంగన్వాడీ సూపర్వైజర్ CDPO/EO అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన విద్యార్హతలు కలిగి ఉండాలి. అవి:
• B.Sc. ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్
• బోటనీ, జువాలజీ & కెమిస్ట్రీ/బయోకెమిస్ట్రీ
• ఫుడ్ టెక్నాలజీ & మేనేజ్‌మెంట్/న్యూట్రిషన్
పైన పేర్కొన్న ఏదైనా కోర్సు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి పూర్తయి ఉండాలి.
మహిళా అభ్యర్థులకు ప్రత్యేక అవకాశాలు
ఈ నియామకాలు ప్రధానంగా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నాయి. మహిళా అభ్యర్థులకు ఇది పెద్ద అవకాశమని భావిస్తున్నారు. ఈ పోస్టుల ద్వారా అంగన్వాడీ కేంద్రాలలో సేవల మెరుగుదల కచ్చితంగా కలుగుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఎంపిక ప్రక్రియ
• అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
• ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహించబడుతుంది.
• పరీక్ష తేదీలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తారు.
🛑CDPO/EO Official Website Click Here
ఈ నియామక ప్రక్రియ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో సేవలను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషించనుంది. మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.