Anganwadi Jobs : మరో కొత్త జిల్లాలో 116 అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీ వివరాలు ఇవే | Anganwadi AWW, AWH & Mini AWW job recruitment apply Offline now
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మరో జిల్లాలో అంగన్వాడీ టీచర్లు అంగనవాడి హెల్పర్ 116 ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగులకు 02 జనవరి 2025 తేదీ లోపల అప్లై చేసుకోవాలి.
Anganwadi Notification : ఆంధ్రప్రదేశ్ లో అన్నమయ్య జిల్లాలో వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్, అంగన్వాడి సహాయకురాలు, మరియు మినీ అంగనవాడి టీచర్ పోస్టులను భర్తీ చేయడం కోసం 116 పోస్టులు తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను https://annamayya.ap.gov.in/ వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు.
అంగన్వాడిపోస్ట్ పేరు
• అంగన్వాడి టీచర్
• అంగన్వాడి సహాయకురాలు
• మినీ అంగన్వాడి టీచర్
అంగన్వాడి ఖాళీల సంఖ్య
• అంగన్వాడి టీచర్ : 11
• అంగన్వాడి సహాయకురాలు : 93
• మినీ అంగన్వాడి టీచర్ : 12
అంగన్వాడి విద్య అర్హతలు
• అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రత్యేక కేటగిరీలకు అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.
వయోపరిమితి
గరిష్ట వయస్సు : సాధారణ 21 సంవత్సరాలు to 35 సంవత్సరాలు
ఎస్‌సి / ఎస్‌టి : 18 సంవత్సరాలు to 35 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పాటు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి.
• దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించాలి.
దరఖాస్తు రుసుము
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి రుసుము అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక విధానం పాఠశాల విద్య, ప్రీ-స్కూల్ ట్రైనింగ్ మరియు మౌఖిక పరీక్ష ఆధారంగా జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు ప్రారంభ తేదీ : 24-12-2024
దరఖాస్తు చివరి తేదీ : 02-01-2025
🛑Notification Pdf Click Here
🛑 Roster Wise District Vacancy List Click Here
🛑Application Pdf Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు
ప్రశ్న 1: అర్హతలలో ఏవైనా మినహాయింపులు ఉన్నాయా?
సమాధానం: ఎస్‌సి/ఎస్‌టి కేటగిరీలకు వయస్సు 18 సంవత్సరాలకు మినహాయింపు ఉంది.
ప్రశ్న 2: ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
సమాధానం: సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించవచ్చు.
ప్రశ్న 3: ఎటువంటి రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి?
సమాధానం: ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో రిజర్వేషన్ నిబంధనలు అమలులో ఉంటాయి.
దరఖాస్తుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.