Anganwadi Helper Recruitment : రాత పరీక్ష లేకుండా కేవలం 10th అర్హతతో అప్లై చేసుకుని సులువుగా అంగన్వాడీ ఆయా ఉద్యోగం పొందండి
Anganwadi Helper Notification : హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు శుభవార్త.. మహిళా శిశు సంక్షేమ శాఖ లో జన్మన్ పథకం కింద కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన మహిళ అభ్యర్థులు నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. వివాహమైన మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
అంగన్వాడీ ఆయా పోస్టుకు కనిష్ట వయసు 21 సంవత్సరాలు మరియు గరిష్ట వయసు 35 సంవత్సరాలు. ముఖ్య గమనిక 21 సంవత్సరాల మహిళ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే, 18 ఏళ్లు పూర్తి చేసిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పాడేరు ప్రాంతంలో జన్మన్ పథకం కింద కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన మహిళా అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించి, సమాజంలో మహిళల అభివృద్ధికి సహకారం అందించడమే లక్ష్యంగా ఉంది. కలెక్టర్ దినేష్కుమార్ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తూ, అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవాలని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు మండలం మరియు పరిసర ప్రాంతాలు ఖాళీగా ఉన్న ఆయా పోస్టులకు అప్లై చేసుకోవాలి కావలసిన వివరాలు
• 10th పాస్ సర్టిఫికెట్
• స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం
• మ్యారేజ్ సర్టిఫికెట్
• ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ
• పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
దరఖాస్తు విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు పత్రాలను సంబంధిత అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు మండలంలో మహిళా శిశు సంక్షేమ అధికారులకు సమర్పించవచ్చు. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31, 2024 సాయంత్రం 5:00 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం ఐసీడీఎస్ కేంద్రాల్లో సంప్రదించాలని కోరుకుంటున్నారు.
ఎంపిక విధానం
టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా మరియు అనుభవం ఆధారంగా రోస్టర్ ప్రకారం గా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Anganwadi Helper Notification Pdf Click Here
🛑Anganwadi Helper Application Pdf Click Here