Court Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే అప్లై చేసుకోండి | Supreme Court Jr Court Assistant 241 Posts Job Recruitment Apply Online Now | Govt Jobs | Telugu Jobs Point

Court Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల వెంటనే అప్లై చేసుకోండి | Supreme Court Jr Court Assistant 241 Posts Job Recruitment Apply Online Now | Govt Jobs | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Supreme Court Jr Court Assistant 241 Posts Notification OUT Details all details in Telugu : సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా లో కొత్త గా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (గ్రూప్ ‘బి’) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 241 తాత్కాలిక ఖాళీలను భర్తీ చేయడం కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు నెల జీతం (రూ. 35,400/- ప్రాథమిక వేతనంతో) ఉంచబడతాయి. అదనంగా HRA వంటి ఇతర సౌకర్యాలు కలిపి సుమారు నెలకు రూ. 72,040/- వరకు స్థూల జీతం లభిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను 2024 డిసెంబర్ 31వ తేదీ నాటికి సమర్పించాలి.

ఆర్గనైజేషన్ పేరు: సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (గ్రూప్ ‘బి’)
మొత్తం ఖాళీలు: 241 (తాత్కాలిక)
ఖాళీలు తాత్కాలికమై మార్పులకు లోబడి ఉంటాయి. పరిపాలనా అవసరాల ప్రకారం ఖాళీల సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

విద్యార్హత

గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ
కంప్యూటర్ పరిజ్ఞానం, 35 w.p.m వేగంతో కంప్యూటర్ టైపింగ్, కంప్యూటర్ ఆపరేషన్స్ జ్ఞానం ఇతర నైపుణ్యాలు
కంప్యూటర్ ఆపరేషన్స్‌లో ప్రావీణ్యం

వయోపరిమితి

దరఖాస్తుదారుల వయస్సు 18 ఏళ్లకు పైగా, 30 ఏళ్లకు లోపుగా ఉండాలి. అయితే, ప్రభుత్వం నిర్దేశించిన విధానాల ప్రకారం క్రింది వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

వయోపరిమితి సడలింపు
• SC/ST : 5 సంవత్సరాలు
• OBC : 3 సంవత్సరాలు
• PH : 10 సంవత్సరాలు
• మాజీ సైనికులు : ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు అనుసరించి

దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

• విద్యార్హతల ధృవీకరణ పత్రాలు
• పుట్టిన తేది ధృవీకరణ పత్రం
• ఫోటోగ్రాఫ్
• సంతకం స్కాన్ కాపీ
• రిజర్వేషన్ హక్కు ఉన్నవారికి సంబంధిత సర్టిఫికేట్

దరఖాస్తు విధానం

• అభ్యర్థులు మొదట www.sci.gov.in వెబ్‌సైట్ సందర్శించాలి.
• నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి, దానిలోని అర్హతలను ఖచ్చితంగా చదవాలి.
• ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూరించాలి.
• అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.

దరఖాస్తు ఫీజు చెల్లింపు తర్వాత, ఫారమ్‌ను సమర్పించాలి. దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.

ముఖ్యమైన తేదీ

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: త్వరలో ప్రకటించబడుతుంది
ఆఖరి తేదీ: 2024 డిసెంబర్ 31

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page