VRO Jobs : ఇంటర్ అర్హతతో 8,000 వీఆర్ పోస్టులకు నోటిఫికేషన్ | Telangana VRO Upcoming Job Recruitment All Details In Telugu | VRO Jobs
Telangana VRO Notification All Details : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేయడం కోసం దశలవారీగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా, 8,000 వీఆర్ఓ (విల్లేజ్ రెవెన్యూ ఆఫీసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. విద్యార్హత ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తిచేయాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వీఆర్ఓ ఉద్యోగం గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోస్టుల భర్తీ ద్వారా గ్రామ స్థాయి పరిపాలనలో మరింత మేలుపరిచే అవకాశాలు ఉన్నాయి.
వీఆర్ఓ ఉద్యోగాల నియామకాన్ని నిర్వహించేది తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖ. ఈ శాఖ పర్యవేక్షణలో వీఆర్ఓలు గ్రామస్థాయిలో వివిధ బాధ్యతలను నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీ కార్యాలయాలు, రెవెన్యూ కార్యాలయాలు వీఆర్ఓల ప్రధాన కార్యాలయాలుగా ఉంటాయి.
ఈ నోటిఫికేషన్ కింద 8,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రతి గ్రామానికి కనీసం ఒక వీఆర్ఓ పోస్టు ఉండేలా చూస్తారు. రిజర్వేషన్ల ప్రకారం ఈ ఖాళీలు విభజింపబడతాయి. వీఆర్ఓ పోస్టులకు దరఖాస్తు చేయదగిన వయోపరిమితి కనిష్ఠ వయస్సు 18 సంవత్సరాలు గరిష్ఠ వయస్సు 44 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
వీఆర్ఓల ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్షలో అభ్యర్థుల సాధారణ పరిజ్ఞానం, భూసంబంధిత చట్టాలపై అవగాహన, నైతికత, కంప్యూటర్ నైపుణ్యాలను పరీక్షిస్తారు. వీఆర్ఓ నోటిఫికేషన్ విడుదల తేదీ, దరఖాస్తు ప్రారంభ తేదీ, చివరి తేదీ వంటి వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబడతాయి.