10th, 12th, ITI, Any డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్, ఫైర్‌మ్యాన్, డ్రైవర్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల వెంటనే అప్లై చేసుకోండి | AOC Jr. Assistant, Fireman, MTS, Driver Tradesman Recruitment 2024, Notification Out in Telugu Apply Now
Army Ordnance Corps Centre Jr. Assistant, Fireman, MTS, Driver Tradesman Notification 2024 AOC Vacancy : నిరుద్యోగులకు శుభవార్త… కేవలం టెన్త్, ITI, డిప్లమా ఎన్ని డిగ్రీ అర్హతతో 723 ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదల. అప్లై చేస్తే 100% జాబ్ వస్తుంది. గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. భారత ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ యూనిట్లు/డిపోలలో డిఫెన్స్ సివిలియన్ గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మెటీరియల్ అసిస్టెంట్ (MA), జూనియర్ కార్యాలయ అసిస్టెంట్ (JOA), సివిల్ మోటార్ డ్రైవర్, ఫైర్‌మ్యాన్, కార్పెంటర్ & జాయినర్, పెయింటర్ & డెకరేటర్, MTS వంటి వివిధ పోస్టుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మహిళా మరియు పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
AOC లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రక్షణ మంత్రిత్వ శాఖలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్‌లో కింది గ్రూప్ ‘సి’ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత జీతము ఎంపిక విధానం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
ఆర్గనైజేషన్ పేరు: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్
ముఖ్య కార్యాలయం: ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్, సికింద్రాబాద్, పిన్: 500015
ప్రభుత్వ విభాగం: రక్షణ మంత్రిత్వ శాఖ
చివరి తేదీ: ఆన్‌లైన్ అప్లికేషన్ తెరిచిన తేదీ నుండి 21 రోజుల్లోగా దరఖాస్తు సమర్పించాలి.
ఖాళీలు వివరాలు
• మెటీరియల్ అసిస్టెంట్ (MA) : 19
• జూనియర్ కార్యాలయ అసిస్టెంట్ (JOA) : 27
• సివిల్ మోటార్ డ్రైవర్ (OG) : 04
• ఫైర్‌మ్యాన్ : 247
• కార్పెంటర్ & జాయినర్ : 07
• పెయింటర్ & డెకరేటర్ : 05
• MTS : 11
• ట్రేడ్స్‌మ్యాన్ మేట్ : 389
అర్హతలు
పోస్టుకు అనుగుణంగా అర్హతల వివరాలు కింది విధంగా ఉంటాయి:
మెటీరియల్ అసిస్టెంట్ (MA) : ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Any డిగ్రీ లేదా సమాన అర్హత.
జూనియర్ కార్యాలయ అసిస్టెంట్ (JOA)
: 12వ తరగతి ఉత్తీర్ణత మరియు టైపింగ్ స్పీడ్ (35 wpm ఇంగ్లీష్ లేదా 30 wpm హిందీ).
సివిల్ మోటార్ డ్రైవర్ (OG) : 10వ తరగతి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
ఫైర్‌మ్యాన్ : 10వ తరగతి మరియు ఫైర్‌మన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
కార్పెంటర్ & జాయినర్ 10వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత.
పెయింటర్ & డెకరేటర్ : 10వ తరగతి మరియు సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణత.
MTS : 10వ తరగతి ఉత్తీర్ణత.
ట్రేడ్స్‌మ్యాన్ మేట్ : 10వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి
• మెటీరియల్ అసిస్టెంట్ (MA) : 18 సంవత్సరాలు to 27 సంవత్సరాలు
• జూనియర్ కార్యాలయ అసిస్టెంట్ (JOA) : 18 సంవత్సరాలు to 25 సంవత్సరాలు
• ఇతర పోస్టులు : 18 సంవత్సరాలు to 25 సంవత్సరాలు
AOC డాక్యుమెంట్ వివరాలు
• విద్యార్హతల ధృవీకరణ పత్రాలు
• వయస్సు నిర్ధారించడానికి బర్త్ సర్టిఫికేట్ లేదా 10వ తరగతి మార్క్ షీట్
• క్యాస్ట్ సర్టిఫికెట్ (వీరికి అనుగుణంగా)
• ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు PwBD అభ్యర్థులకు సంబంధిత సర్టిఫికేట్లు
• పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
• సంతకం చేసిన స్కాన్ కాపీ
దరఖాస్తు విధానం
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://aocrecruitment.gov.in ను సందర్శించాలి.
అక్కడ అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫారమ్‌ను నింపి అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here