Good News : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా AP, TS రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం | Andhra Pradesh and Telangana Ration Dealers Jobs Notification Apply Now
AP, TS Ration Dealers Job Recruitment : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్లలో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కేవలం పదో తరగతి పాస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రకటన ప్రకారం, చీరాల, రేపల్లె, మరియు మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని మొత్తం 219 రేషన్ దుకాణాలకు డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీలు, అర్హతలు, మరియు ఎంపిక విధానంపై ప్రత్యేకంగా వివరాలు ప్రకటించబడ్డాయి.
ఆర్గనైజేషన్ వివరాలు
• చీరాల రెవెన్యూ డివిజన్ మొత్తం దుకాణాలు: 143
• కొత్త దుకాణాలు: 4
• రేపల్లె రెవెన్యూ డివిజన్ : 46
• బైఫర్కేషన్ ద్వారా ఖాళీలు: 3
• మిర్యాలగూడ డివిజన్ : మొత్తం ఖాళీలు: 30
ఈ నియామక ప్రక్రియను నిర్వహించడానికి కలెక్టర్ల ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీవో కార్యాలయాలు వ్యవహరిస్తున్నాయి.
అర్హతలు
చౌక ధరల దుకాణాల డీలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింద పేర్కొన్న అర్హతలను కలిగి ఉండాలి:
• కనీసం 10th, ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
• వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్ఠంగా 40 సంవత్సరాలు.
• నివాస స్థానం
• సదరు దుకాణం ఉన్న గ్రామానికి చెందిన వారు.
• పోలీసు కేసులు ఎటువంటి క్రిమినల్ కేసులు లేకపోవాలి.
వయోపరిమితి
సాధారణ అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య రిజర్వ్డ్ కేటగిరీకి
ప్రభుత్వం నిర్ణయించిన మినహాయింపు
అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు కింద పేర్కొన్న పత్రాలను సమర్పించాలి:
• విద్యార్హత ధ్రువీకరణ పత్రం (10th, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్).
• వయోపరిమితి ధ్రువీకరణ పత్రం (పుట్టినతేదీ ఆధారంగా).
• నివాస ధ్రువీకరణ పత్రం (ఆధార్, ఓటర్ ID లేదా పాన్ కార్డు).
• కుల ధ్రువీకరణ పత్రం (అర్హత ఉంటే).
• పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్.
• స్వీయ నిరుద్యోగ ధ్రువీకరణ పత్రం.
• మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.
దరఖాస్తు విధానం
అభ్యర్థులు సంబంధిత రెవెన్యూ డివిజన్ ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తు ఫారాలను పొందాలి.
దరఖాస్తులను పూర్తి చేసి, కావలసిన పత్రాలను జతచేసి, అధికారుల వద్ద సమర్పించాలి.
గడువు తేదీలు:
• చీరాల, రేపల్లె: నవంబర్ 28.
• మిర్యాలగూడ: నవంబర్ 25 సాయంత్రం 5 గంటలలోపు.
• రాతపరీక్షలకు ఎంపికైన వారికి హాల్ టికెట్లు జారీ చేయబడతాయి.
• డిసెంబర్ 2న రాతపరీక్షలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియ చేపడతారు.
ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థులు అర్హతలను, గడువులను గౌరవించి తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం సంబంధిత ఆర్డీవో కార్యాలయాలను సంప్రదించగలరు.
🛑Notification Pdf Click Here