కొత్త గా గృహ నిర్మాణానికి : 4 లక్షల ఆర్థిక సహాయం
Pradhan Mantri Awaas Yojana Gramin scheme :-పేదలకు శుభవార్త, సొంత ఇల్లు కావాలనుకున్న వాళ్లకి వెంటనే పూర్తిగా ఈ ఆర్టికల్ చదవండి. నాలుగు లక్షలు ఎలా పొందాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం 25 జూన్ 2017న ప్రారంభించింది. ఇల్లు లేని వాళ్ళని ఇల్లు కట్టుకోవాలి. నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయడానికి ఈ పథకం ప్రారంభించారు.
ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అందజేస్తుంది ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం వాటాను 2.5 లక్షల అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కచ్చితంగా మరో 1.5 లక్షల ఇవ్వాలని స్పష్టం చేసింది. గృహ నిర్మాణం పై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్హత:-
• ఇల్లు లేని కుటుంబాలు అర్హులు.
•ఒకటి లేదా రెండు గోడలు, కచ్చ గోడలుమరమతులు చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
•ఈ పథకానికి అప్లై చేసుకోవడం అభ్యర్థి 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
•అభ్యర్థి వార్షిక ఆదాయం మూడు లక్షల నుంచి ఆరు లక్షల మధ్యలో ఉండాలి.
•దరఖాస్తుదారుని పేరు రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు జాబితాలో ఉండాలి.
•దరఖాస్తు దారిని ఓటరు జాబితాలో తమ పేరు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క అవసరమైన డాక్యుమెంట్ వివరాలు :-
•ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబర్
• తాజాగా తీసుకున్న ఫోటో
• బ్యాంక్ పాస్ బుక్
•మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి.
PMAY ఎలా దరఖాస్తు చేసుకోవాలి :-
మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అప్లై చేసుకోవాలని అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. అనగా ఈ సేవ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాలు వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లేదా హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. https://pmaymis.gov.in/ వెబ్‌సైట్ కు లాగిన్ అవ్వండి పూర్తి వివరాలు తెలుసుకోండి.