TTD Calendars 2027 : టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీల ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే?
TTD Diaries/Calendars /Panchangam 2027 online booking : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు శుభవార్త చెప్పింది. 2027 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్లు ప్రకటించింది. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా వీటిని పొందవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌తో పాటు పలు నగరాల్లోని టీటీడీ విక్రయ కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంచింది.

టీటీడీ క్యాలెండర్లు, డైరీలు ఆన్లైన్లో బుకింగ్ : శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ప్రతి సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా 2027 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న భక్తులు ఇంటి నుంచే అధికారిక వెబ్సైట్లో Click Here బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ ప్రాంతాల్లో నేరుగా కొనుగోలు చేయవచ్చు : ఆన్లైన్లో బుక్ చేసుకోలేని భక్తుల కోసం టీటీడీ ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తిరుపతి, తిరుమల, తిరుచానూరులోని టీటీడీ ప్రచురణల విక్రయ విభాగానికి చెందిన మొత్తం 12 కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్ టీటీడీ సమాచార కేంద్రాల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. అలాగే విజయవాడ, చెన్నై, వేలూరు, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై నగరాల్లోని టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా విక్రయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

టీటీడీ క్యాలెండర్లు 2027 ఎలా బుక్ చేసుకోవాలి?
• టీటీడీ క్యాలెండర్లు, డైరీలు కావాలనుకునే భక్తులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను https://tirupatibalaji.ap.gov.in/ సందర్శించాలి.
• అక్కడ Home Page లో అందుబాటులో ఉన్న Diaries/Calendars /Panchangam ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
• ముందుగా అభ్యర్థులు Sign up పైన క్లిక్ చేయండి. New registration ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో తమ యొక్క పూర్తి వివరాలు ఇచ్చి.. రిజిస్ట్రేషన్ అవ్వండి.

