నిరుద్యోగులకు తీపికబురు.. 1,466 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 పోస్టులు | APPSC Recruitment 2026

నిరుద్యోగులకు తీపికబురు.. 1,466 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 పోస్టులు | APPSC Recruitment 2026

APPSC 1466 Jobs Group 2 Recruitment 2026 : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ (APPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. జాబ్ క్యాలెండర్‌లో భాగంగా మొత్తం 1,466 పోస్టుల భర్తీకి 10 ప్రాథమిక నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో గ్రూప్-2 విభాగంలో 686 పోస్టులు, ఇతర శాఖల్లో 780 పోస్టులు ఉన్నాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

గ్రూప్-2 ఉద్యోగాల్లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 200, డిప్యూటీ ఎంపీడీఓ పోస్టులు 176, సీనియర్ అకౌంటెంట్ పోస్టులు 90, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి. వీటితో పాటు సబ్ రిజిస్ట్రార్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

APPSC Recruitment 2026 – Overview

మొత్తం పోస్టులు: 1,466
మొత్తం ప్రాథమిక నోటిఫికేషన్లు: 10
గ్రూప్-2 పోస్టులు: 686
ఇతర శాఖల పోస్టులు: 780
AEE పోస్టులు: 503
గ్రూప్-2 దరఖాస్తులు: నవంబర్ 10 నుంచి 30 వరకు
AEE దరఖాస్తులు: నవంబర్ 2 నుంచి 22 వరకు
ఇతర పోస్టులు: నవంబర్ 6, నవంబర్ 18 తేదీల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
నియామక సంస్థ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
ముఖ్య గమనిక: విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు తదితర వివరాలను పూర్తి అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.
అధికారిక వెబ్‌సైట్: [APPSC అధికారిక వెబ్‌సైట్](https://psc.ap.gov.in/)

ఇతర శాఖల్లో 780 ఉద్యోగాలు : గ్రూప్-2తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులు 503, డైట్ లెక్చరర్ పోస్టులు 104, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 50, డైట్ సీనియర్ లెక్చరర్ పోస్టులు 46 భర్తీ చేయనున్నారు. మైన్స్, ఎండోమెంట్స్, ఎక్సైజ్, ఎస్సీఈఆర్టీ విభాగాల్లోనూ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తుల తేదీలు ఎప్పటి నుంచి : ఇచ్చిన ప్రాథమిక ప్రకటన ప్రకారం, AEE సహా కొన్ని పోస్టులకు నవంబర్ 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రూప్-2 పోస్టులకు నవంబర్ 10 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం. మైన్స్, ఎక్సైజ్ విభాగాల్లోని కొన్ని పోస్టులకు నవంబర్ 6 నుంచి, విద్యా విభాగంలోని కొన్ని పోస్టులకు నవంబర్ 18 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

పూర్తి నోటిఫికేషన్‌లో ఏముంటుంది : ప్రస్తుతం విడుదలైనవి ప్రాథమిక నోటిఫికేషన్లు మాత్రమే. ఖాళీల వారీగా రిజర్వేషన్లు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలను ఏపీపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్లలో వెల్లడించనుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక ప్రకటనలను పరిశీలించడం మంచిది.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *