ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డులో 18 ఉద్యోగాలు.. జీతం రూ.1,37,220 వరకు APPSC Analyst Grade-II Recruitment 2026 AP Pollution Control Board Notification 2026 Apply Now

ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డులో 18 ఉద్యోగాలు.. జీతం రూ.1,37,220 వరకు APPSC Analyst Grade-II Recruitment 2026 AP Pollution Control Board Notification 2026 Apply Now

APPSC AP Pollution Control Board Analyst Grade-II Recruitment 2026 Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులో అనలిస్ట్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ నంబర్ 21/2026. ఎంపికైన అభ్యర్థులకు రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు పే స్కేల్ ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. పరీక్షను కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్ష (CBRT) విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష తేదీని కమిషన్ తర్వాత ప్రకటిస్తుంది.

APPSC Analyst Grade-II Recruitment 2026 – Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
బోర్డ్ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు
పోస్టు పేరుAnalyst Grade-II 
మొత్తం పోస్టులు 18
విద్యా అర్హతకెమిస్ట్రీ / బయోకెమిస్ట్రీ / బయాలజీ / ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ
వయోపరిమితి18–44 సంవత్సరాలు 
వయస్సు లెక్కింపు తేదీ01 జూలై 2026
దరఖాస్తు ప్రారంభ తేదీ 13 అక్టోబర్ 2026
దరఖాస్తుకు చివరి తేదీ02 నవంబర్ 2026, రాత్రి 11:59 గంటల వరకు
సెలక్షన్ విధానం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT)
దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు₹250
పరీక్ష ఫీజు₹80
పరీక్ష తేదీత్వరలో ప్రకటిస్తారు
అధికారిక వెబ్‌సైట్https://psc.ap.gov.in/

విద్యార్హతలు : ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, బయాలజీ లేదా ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి : 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు వర్తిస్తుంది. మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం వయోపరిమితి ప్రయోజనాలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు రూ.250 ప్రాసెసింగ్ ఫీజు, రూ.80 పరీక్ష ఫీజు చెల్లించాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న అభ్యర్థులు, మాజీ సైనికులు తదితరులకు పరీక్ష ఫీజు మినహాయింపు నిబంధనలు వర్తిస్తాయి. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఫీజు మినహాయింపు, రిజర్వేషన్‌కు సంబంధించిన నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

దరఖాస్తు ఎలా చేయాలి : ముందుగా APPSC అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ను సందర్శించాలి. ఇప్పటికే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (OTPR) చేసుకున్న అభ్యర్థులు తమ యూజర్ ఐడీతో లాగిన్ కావాలి. కొత్త అభ్యర్థులు ముందుగా OTPR నమోదు పూర్తి చేసి, అనంతరం Analyst Grade-II నోటిఫికేషన్‌ను ఎంచుకుని దరఖాస్తు సమర్పించాలి.

దరఖాస్తు చేసే ముందు విద్యార్హతలు, వయస్సు, ఫీజు, రిజర్వేషన్ నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించాలి. OTPR నమోదు మాత్రమే దరఖాస్తుగా పరిగణించబడదు.

ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13 అక్టోబర్ 2026 దరఖాస్తులకు చివరి తేదీ: 2 నవంబర్ 2026, రాత్రి 11:59 గంటల వరకు.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *