ASHA Worker Jobs : గ్రామ సచివాలయంలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ.. టెన్త్ అర్హతతో మహిళలకు అవకాశం.. నెలకు రూ. 10 వేల జీతం
AP ASHA WORKER Jobs 2026 42 New Vacancies Eligibility Salary And District Wise Details In Telugu : శ్రీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ & మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా రూరల్ ట్రైబల్ & అర్బన్, సచివాలయ పరిధిలో ఆశాకార్యకర్తలుగా పనిచేయుటకు గాను నియామకాలను ధరఖాస్తులు కోరడమైనది.

1). ఆశా తప్పనిసరిగా ఆ సచివాలయ పరిధి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో నివసించే స్త్రీ అయి ఉండాలి – ప్రాధాన్యంగా “వివాహితులు/వితంతువులు/ విడాకులు తీసుకున్న వారు మరియు ప్రాధాన్యంగా 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వయస్సులోపు వారు.
2). ఆశా కార్యకర్త తప్పనిసరిగా గ్రామీణ/గిరిజన ప్రాంతంలో సచివాలయ పరిది – (గ్రామీణ, గిరిజన ప్రాంతంలో) నివసించే స్త్రీ అయి ఉండాలి ప్రాదాన్యంగా “వివాహితులు / వితంతువులు / విడాకులు తీసుకున్నవారు మరియు ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సులోపు వారు మరియు నిర్దిష్టమైన వాటికి చెందినవారై ఉండాలి.
3). ఆరోగ్య, సంక్షేమ, పారిశుధ్య, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకు వివరించేతత్వము నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పధం కలిగివుండాలి
4). ఆమె కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగిన అక్షరాస్యులైన మహిళలు అయి ఉండాలి.
5). తెలుగు బాగా చదవటం, రాయడం తప్పని సరిగా వచ్చి ఉండాలి.
6). తన పనులను నిర్వహించడానికి సమయాన్ని వెతకడానికి, ఆమెకు కుటుంబం మరియు సామాజిక మద్దతు ఉండాలి.
దరఖాస్తుతో ధృవీకరణ అందజేయవలిసిన ధృవపత్రములు: నివాస ధృవీకరణ పత్రము (తహసిల్దారు ద్వారా జారిచేయబడిన నివాస ధృవీకరణ పత్రము / రేషన్ కార్డు / బి.పి. యల్. కార్డు / వోటరు కార్డు /ఆదార్ కార్డు ) & 10వ తరగతి సర్టిఫికట్ కాపీ.
42 ఆశా కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్న పై సచివాలయాలలో మాత్రమె నింపబడును, పై నియామకమునకు సంబందించిన ఖాళీలు / అర్హత నిబంధనలతో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసే అధికారము చైర్మన్, డిస్ట్రిక్ హెల్త్ సొసైటీ వారికి కలదని తెలియపరచడమైనది.
పై అర్హత కలిగిన అభ్యర్ధులు సదరు దరఖాస్తును https://parvathipurammanyam.ap.gov.in/ ద్వారా డౌన్లోడ్ చేసుకొని తేది: 09/10/2025 సాయంత్రం 5.00 గంటల లోపు తమ దరఖాస్తుతో పాటు విద్యార్హతల నకలుల తోపాటు. గ్రామీణ/ గిరిజన/పట్టణ ప్రాంతం ఆశా కార్యకర్తనకు సంబంధిత వైద్యాధికారి, Primary Health Centreకు ధరఖాస్తు ను అందజేయ వలెను.
చిరునామా : వైద్యాధి కారి, జిల్లా వైద్య &ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

