APPSC Hostel Welfare Officer Jobs 2026 : డిగ్రీ అర్హతతో అక్టోబర్ 9 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు
APPSC Hostel Welfare Officer Grade 2 Recruitment 2026: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ శాఖల్లో మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు 2026 అక్టోబర్ 9 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 29, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువు లోపు అధికారిక APPSC వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి.
సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులో 21 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులో 23 పోస్టులు, బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసులో 29 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 73 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర అర్హతలు, వయోపరిమితి తదితర వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా పరిశీలించాలి.
జీతం ఎంత : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులకు నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు పే స్కేల్ ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు వర్తించే అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం : ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మొత్తం 150 మార్కులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు : APPSC హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులకు అక్టోబర్ 9, 2026న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అక్టోబర్ 29, 2026 చివరి తేదీ. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్లోని అర్హతలు, నిబంధనలు, పరీక్ష విధానం, ఇతర వివరాలను ఒకసారి పూర్తిగా పరిశీలించడం మంచిది.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

