AP మహిళలకు గుడ్ న్యూస్.. పల్లెటూళ్లకూ ఏసీ బస్సులు.. 750 ఎలక్ట్రిక్ బస్సులు
ap apsrtc ac electric buses 750 new buses : ఏపీలో APSRTC బస్సు ప్రయాణికులకు కీలక మార్పులు రానున్నాయి. 550 AC బస్సుల కొనుగోళ్లకు టెండర్లు కొనసాగుతుండగా, నవంబర్ నాటికి 750 AC ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. పూర్తి వివరాలు కి వెళ్ళినట్లయితే

ఆంధ్రప్రదేశ్లో RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై APSRTCలో కొత్తగా కొనుగోలు చేసే బస్సుల్లో ఏసీ బస్సులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులకు కూడా మెరుగైన ప్రయాణ సౌకర్యం అందేలా చర్యలు చేపడుతున్నారు.
APSRTCలో వచ్చే కొత్త బస్సులన్నీ ఏసీ బస్సులుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో అధికారులు కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.
ఇప్పటికే 550 ఏసీ సీఎన్జీ బస్సుల కొనుగోళ్లకు టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
మరోవైపు నవంబర్ నెలాఖరులోగా 750 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వీటి కోసం అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12 ప్రధాన డిపోల పరిధిలో ఛార్జింగ్ స్టేషన్ల పనులు అక్టోబర్ నెలాఖరుకు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఛార్జింగ్ వసతులు సిద్ధమైతే ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మరింత సులభం కానుంది.

ఈ కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు కూడా ఏసీ బస్సు సేవలు విస్తరించే అవకాశం ఉంది. దీంతో పల్లెటూళ్ల నుంచి ప్రయాణించే ప్రజలకు కూడా మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అందులో కూడా మహిళలకు & దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే.. కొత్త ఏసీ సీఎన్జీ బస్సులతో పాటు 750 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు రావడం APSRTCలో కీలక మార్పుగా నిలవనుంది.

