SBI Clerk Admit Card 2026: 9,766 పోస్టులు.. అడ్మిట్ కార్డ్స్ రిలీజ్
SBI Clerk Admit Card 2026 9766 Junior Associate : SBI జూనియర్ అసోసియేట్ 9,766 పోస్టులకు ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 26, 27న పరీక్షలు. కాల్ లెటర్ డౌన్‌లోడ్ విధానం, ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి.
SBI జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. 9,766 జూనియర్ అసోసియేట్ (Customer Support & Sales) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక SBI Careers వెబ్‌సైట్ నుంచి తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సెప్టెంబర్ 26, 27న పరీక్ష : SBI జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్షలు సెప్టెంబర్ 26, 27, 2026 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థుల పరీక్ష తేదీ, షిఫ్ట్, రిపోర్టింగ్ సమయం, పరీక్ష కేంద్రం వంటి వివరాలు వారి కాల్ లెటర్‌లో ఉంటాయి. కాబట్టి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులోని వివరాలను పూర్తిగా చెక్ చేసుకోవాలి.
అడ్మిట్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
ముందుగా SBI అధికారిక Careers వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ Current Openings విభాగంలో Junior Associate Recruitmentకు సంబంధించిన Preliminary Examination Call Letter లింక్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా వంటి లాగిన్ వివరాలను నమోదు చేసి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్ కార్డును ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. పేరు, ఫోటో, పరీక్ష తేదీ, షిఫ్ట్, పరీక్ష కేంద్రం తదితర వివరాల్లో ఏదైనా సమస్య ఉంటే వెంటనే SBI అధికారిక సూచనలను పరిశీలించాలి.
పరీక్షకు వెళ్లే ముందు ఇది మర్చిపోవద్దు : పరీక్ష రోజున కాల్ లెటర్‌తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. SBI సూచనల ప్రకారం కాల్ లెటర్, ఐడీ వివరాలను పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి 1 Hrs ముందుగానే చేరుకోవడం మంచిది.

🛑SBI Clerk Admit Card 2026 Direct Link

