VB-G RAM G Scheme : eKYC ఉంటేనే వేతనాలు.. రేపటి నుంచే కొత్త విధానం
Telangana VB-G RAM G eKYC Skilled Semi Skilled Workers : VB-G RAM G పథకంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు eKYC తప్పనిసరి. ఈ రోజులు నుంచి eKYC ఉంటేనే e-మస్టర్‌లో పేరు, హాజరు నమోదయ్యే అవకాశం. పూర్తి వివరాలు ఇవే.
VB-G RAM G పథకం కింద పనిచేస్తున్న స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు eKYC ఇప్పుడు తప్పనిసరి కానుంది. ఈ రోజులు నుంచి eKYC పూర్తి చేసిన కార్మికులకే e-మస్టర్‌లో పేరు నమోదై, పని ప్రదేశంలో హాజరు నమోదు చేసే విధానం అమల్లోకి రానున్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కేటగిరీలో మొత్తం 76,659 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు కేవలం 79 మందికే eKYC పూర్తైనట్లు సమాచారం. దీంతో మిగిలిన కార్మికులు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
eKYC ఎందుకు కీలకం : eKYC పూర్తయిన తర్వాతే సంబంధిత కార్మికుడి వివరాలు e-మస్టర్‌లో నమోదయ్యే అవకాశం ఉంటుంది. అనంతరం పని ప్రదేశంలో హాజరును నమోదు చేయడానికి వీలు కలుగుతుంది. అందువల్ల eKYC పూర్తి చేయని వారికి పని హాజరు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
వేతనాలపైనా ప్రభావం : eKYC పూర్తికాకపోతే హాజరు నమోదుతో పాటు వేతనాల చెల్లింపు ప్రక్రియపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. గతంలో పనిచేసిన కాలానికి సంబంధించిన వేతన బిల్లుల ప్రాసెసింగ్ కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. VB-G RAM G పథకం 2026 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పథకంలో e-మస్టర్, డిజిటల్ రికార్డులు, పని కొలతల ఆధారంగా వేతన చెల్లింపులు వంటి ప్రక్రియలకు ప్రాధాన్యం ఉంది.

కార్మికులు ఏం చేయాలి : స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కేటగిరీలో ఉన్న కార్మికులు తమ eKYC స్థితిని సంబంధిత అధికారుల వద్ద నిర్ధారించుకుని, పెండింగ్‌లో ఉంటే వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. ముఖ్యంగా రేపటి నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో eKYC పూర్తి చేయడంలో ఆలస్యం చేయకపోవడం ద్వారా హాజరు, వేతన ప్రక్రియలో ఇబ్బందులను నివారించవచ్చు.

