ఏపీ లో 913 ఆశా కార్యకర్తల పోస్టులు.. APPLY చేశారా? అర్హత, జీతం, దరఖాస్తు వివరాలు | Asha Workers Jobs
AP Asha Workers 913 Posts Apply Eligibility Salary : APలో 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 10వ తరగతి, వయసు 25-45 ఏళ్లు ఉండాలి. జీతం రూ.10,000. పూర్తి వివరాలు ఇలా.
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు అంత గ్రామం లేదా వార్డులో మరో ఉద్యోగ అవకాశం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల (ASHA Workers) పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

స్థానిక మహిళలకు అవకాశం : ఈ ఉద్యోగాలకు సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళలు అర్హులుగా ఉంటారు. అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. స్థానికంగా ఆరోగ్య సేవలకు సహకరించేలా ఆశా కార్యకర్తల నియామకాలు చేపడుతున్నారు. ఎంపికైన ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10,000 గౌరవ వేతనం లభిస్తుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.8,320 చెల్లిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి : అర్హత ఉన్న మహిళలు తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC), అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) వద్ద సంబంధిత వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు, దరఖాస్తు తేదీల్లో కొంత తేడా ఉండొచ్చు. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో 22 పోస్టులకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదలై, సెప్టెంబర్ 21 వరకు దరఖాస్తుల గడువు ఇచ్చారు.
సెప్టెంబర్ 30లోగా ఎంపిక ప్రక్రియ : ఆశా కార్యకర్తల ఎంపికను జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా చేపట్టనున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జిల్లాల వారీగా ఎంపిక జాబితాలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూకు ప్రాధాన్యం ఉంటుంది.
జిల్లాల వారీగా ఖాళీలు : రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజన, పట్టణ ప్రాంతాల్లో కలిపి ఈ 913 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో 673 పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో, 64 గిరిజన ప్రాంతాల్లో, 176 పట్టణ ప్రాంతాల్లో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
APPLY చేయాలనుకునే వారు ఏం చేయాలి : మీ గ్రామం లేదా వార్డుకు ఈ పోస్టు వర్తిస్తుందా? మీ విద్యార్హత, వయసు నిబంధనలకు సరిపోతుందా? అనే విషయాలను ముందుగా నిర్ధారించుకోవాలి. అనంతరం మీ పరిధిలోని PHC/UPHC లేదా సంబంధిత జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో దరఖాస్తు విధానం, చివరి తేదీ, అవసరమైన ధ్రువపత్రాల వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవడం మంచిది.

జిల్లాల వారీగా దరఖాస్తు చివరి తేదీలు వేర్వేరుగా ఉండే అవకాశం ఉన్నందున, మీ జిల్లాకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను తప్పనిసరిగా పరిశీలించండి. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల ASHA నియామకానికి సెప్టెంబర్ 25 వరకు గడువు ప్రకటించారు; ఏలూరు జిల్లాలో సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తుల ప్రక్రియ ఉన్నట్లు జిల్లా పోర్టల్లో పేర్కొన్నారు. కింద ఇచ్చిన వెబ్సైట్ ద్వారా లేదా డిస్టిక్ న్యూస్ పేపర్స్ లో కూడా దీనికి సంబంధించిన సమాచారం ఇస్తుంటారు.
🛑 Andhra Pradesh District Wise Website Link Click Here

