NTR Bharosa Pension 2026 ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం… ఇంటికి వచ్చే ఇవి చెక్ చేస్తారు.
NTR Bharosa Pension 2026 Field Verification Start Now : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి అలర్ట్.. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేయడంతో పని అయిపోలేదు. దరఖాస్తుదారులు అప్లై చేసుకున్న టైంలో ఇచ్చినటువంటి వివరాలు అర్హతలు, కుటుంబ పరిస్థితులు, భూమి, ఆదాయం, వాహనము, విద్యుత్ వినియోగము వంటి అంశాలు ఇంటికి వచ్చి పరిశీలించడం జరుగుతుంది.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటిని భౌతికంగా సందర్శించి ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించే సమయంలో కొన్ని ప్రశ్నలు ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తారు. ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ ఫామ్ లో అడిగే ప్రశ్నలు ఏంటి, ఏ వివరాలు నమోదు చేయాలి, ఏ క్యాటగిరి పెన్షన్కు ఏ శాఖ ద్వారా వెరిఫికేషన్ జరుగుతుంది. అన్ని వివరాలు ఇప్పుడు మనం సులువుగా తెలుసుకుందాం. ముఖ్యంగా క్షేత్ర పరిశీలన ఫామ్ లో ఆధార్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ భూమి వివరాలు, వాహనం, విద్యుత్ వినియోగం, ఇతర పెన్షన్ మరియు సంబంధిత సర్టిఫికెట్ వివరాలను పరిశీలిస్తారు.

ఫీల్డ్ వెరిఫికేషన్ లో ముఖ్యంగా వయసు, కుటుంబం మాగాణి భూమి అయితే 3 ఎకరాలు లోపు, మిట్ట భూమి అయితే 10 ఎకరాల లోపు ఉడాలి. నాలుగు చక్రాల వాహనం ఉందా లేదా చెక్ చేస్తారు. టాక్సీ, ఆటో & ట్రాక్టర్ మినహాయింపు ఉంటుంది. గత 12 నెలల ఇంటి విద్యుత్తు వినియోగ నమోదును పరిశీలిస్తారు. ప్రభుత్వ, సెంట్రల్, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా అని చెక్ చేస్తారు. తెల్ల రేషన్ కార్డు, పట్టణ ప్రాంతాల్లో 1000 sq ft లోపు నివాస భవనం ఉండాలి. అలాగే కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10,000/- పట్టణ ప్రాంతాలలో రూ.12,000/- లోపు ఉండాలి. కుటుంబంలో వేరు పెన్షన్ను ఉన్నారా, ఆరోగ్యం మరియు వికలాంగుల పెన్షన్ ఉన్నారా అన్నీ కూడా చెక్ చేస్తారు. పెన్షన్ కేటగిరీని అనుసరించి ధ్రువీకరణ పత్రాలను కూడా పరిశీలించి ప్రత్యేక వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వృత్తి పెన్షన్ మరియు ట్రాన్స్ జెండర్ పెన్షన్ వంటి కేటగిరి సంబంధించి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పరిశీలించి, Mandal Parishad Development Officer ఆఫీసర్ కు సెండ్ చేస్తారు. ఇంకా అప్లై చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే 18 సెప్టెంబర్ 2026 లోపల అప్లై చేసుకోండి.
ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ దరఖాస్తు ధృవీకరణ ఫారం – పరిశీలించిన అంశాలు
1. వయస్సు
2. కుటుంబ భూమి మొత్తము- (కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి 10 ఎకరాల లోపు మెట్ట లేదా మెట్ట మరియు మాగాణి కలిపి 10 ఎకరాలకు లోపు).
3. నాలుగు చక్రాల సొంత వాహనము (మినహాయించిన టాక్సీ, ఆటో, ట్రాక్టర్ కాకుండా)
4. నివాసం ఉంటున్న గృహం గత సంవత్సర కాలం 12 నెలల ఇంటి విద్యుత్తు సరాసరి మొత్తము(యునిట్లలో).
5.ప్రభుత్వ (స్టేట్/సెంట్రల్) /ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారా?
6. తెల్లరేషన్ కార్డు నెంబరు
7. పట్టణ ప్రాంతాల్లో 1000 Sq ft లోపు నివాస భవనం ఉన్నదా ?
8. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.10,000/-, పట్టణ ప్రాంతాలలో నెలకు రూ.12,000/ లోపు ఉన్నదా?
9. కుటుంబం లో వేరే పింఛను ఉన్నదా? (ఆరోగ్య/ వికలాంగుల పింఛను కాకుండా)
10.కుటుంబ సభ్యులు ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారా?
11. ఇతర పింఛన్లు పొందుతున్నారా? (మిలటరీ, స్వాతంత్య్ర సమరయోధులు, ఈ పి.యఫ్)
12. సంబందిత సర్టిఫికేట్ లు జతపరచబడినవా?
13.మర్క్స్ అర్హులా / ఆనర్హులా వివరణతో సహా
గమనిక : కింద అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చాను ఒకటికి రెండుసార్లు చదవండి. వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఫ్రొమ్ పూర్తిగా చెక్ చేసి సిగ్నేచర్ చేయండి.

🛑NTR Bharosa New Pension Application Verification form

