నవోదయ 9వ, 11వ తరగతి ఉచిత అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల | JNVST 2027 Class 9th, 11th Admission Notification
Jawahar Navodaya Vidyalaya School 9th, 11th JNVST Admission Notification 2026 : విద్యార్థులకు ఉచితంగా నవోదయ (JNVST) స్కూల్లో అవకాశం. జవహర్ నవోదయ విద్యాలయంలో CBSE ద్వారా 2027-28 విద్యా సంవత్సరంలో 9, 11 వ తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఉచిత CBSE విద్య, ఉచిత వసతి & భోజనం, ఉచిత పుస్తకాలు & దుస్తులు & అదునాతన క్రీడా సౌకర్యాలు నవోదయ విద్యాలయ సమితి (NVS) లో ఉంటుంది.

జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి తొమ్మిదవ తరగతి, 11వ తరగతి లలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బ్రాహ్మనల్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు. దేశవ్యాప్తంగా 1330 సీట్లు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ లో 38 సీట్లు తెలంగాణలో 30 సీట్లు ఉన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో గంగాధర్, కరీంనగర్, హాజూరాబాద్, పెద్దపల్లి, మహదేవాపూర్, మదని, సిరిసిల్ల, జగిత్యాల, సుల్తానాబాద్, వేములవాడ, మల్యాల, మెట్ పల్లిలో తదితర ప్రాంతాలలో గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి ప్రవేశాల కోసం అలాగే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 30 సూచిస్తున్నారు.
పై అర్హత కలిగిన విద్యార్థులు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు 9వ తరగతి ప్రవేశం కోసం https://cbseitms.nic.in/2026/nvsix_IX ఈ లింకు పై క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి ప్రవేశం కోసం https://cbseitms.nic.in/2026/nvsxi_11 ఈ లింకు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

🛑9th Class Admission Full Details
🛑11th Class Admission Full Details

