Government Schools : విద్యార్థులకు శుభవార్త.. ప్రభుత్వ పాఠశాలలో ‘నో బ్యాగ్ డే’ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
Telangana Education Department has ordered No Bag Day government schools 2026 : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ప్రతి నెలలో మూడో శనివారం రోజు నో బ్యాక్ డే గా నిర్వహిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పది రోజులు పాటు నో బ్యాక్ డే గా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నో బ్యాక్ డే గా పాటించవలసిన తేదీ వివరాలు విద్యాశాఖ ఖరారు చేశారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న, నవంబర్ 21న, డిసెంబర్ 19న, ఫిబ్రవరి 20న & మార్చి 20వ తేదీన నో బ్యాగ్ డే రోజుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలో ఆటపాటలు మరియు కొత్త స్కిల్స్ తో నో బ్యాగ్ డే రోజున విద్యార్థులకు నేర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు . విద్యార్థులకు ఆటపాటలతో పాటు సైన్స్ ప్రయోగాలు చేపించడం విహారయాత్రలకు తీసుకువెళ్లడం కార్యక్రమంలో నిర్వహించాలని ప్రభుత్వం తెలిపారు. వీటితోపాటు అదనంగా కొత్త స్కిల్స్ నేర్పించాలని పాఠశాల విద్యాశాఖ సూచించారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో నో బ్యాక్ డే కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాలలో కూడా సెప్టెంబర్ నెలలో 4వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 12న రెండవ శనివారం మరియు సెప్టెంబర్ 26న నాలుగో శనివారం బ్యాంకులు కూడా లీవ్ ఉంటాయి. అలాగే సెప్టెంబర్ 14న సోమవారం రోజున గణేష్ చతుర్థి వేడుకల నిమిత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 21న శ్రీ నారాయణ గురు సమాధి దినం వంటి ప్రత్యేక రోజులలో కొన్ని ప్రాంతాలు సెలవులు ఉన్నాయి.


