PM Kisan 24th installment : రైతులకు అలర్ట్.. ఆగస్టు 31 లోగా అగ్రిస్ట్రాక్ ఫార్మర్ ఐడి పూర్తి వివరాలు
PM Kisan 24th installment 2026 Latest News : రైతులకు అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి 24 విడుదల కింద రూ.2,000/- ఆర్థిక సాయం పొందాలనుకున్న అభ్యర్థులకు కేంద్రం కీలక అప్డేట్ జారీ చేశారు. అదేంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి (PM Kisan) ద్వారా 24వ విడుదల కింద రూ.2000/- ఆర్థిక సహాయం పొందాలనుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం రైతులకు కీలక అప్డేట్ ఇచ్చింది. ఈసారి 24న విడుదల నిధులు పొందాలనుకున్న అభ్యర్థులకు అగ్రిస్ట్రాక్ ఫార్మర్ ఐడి (Agristack Farmer ID) తప్పనిసరి చేశారు. దీనికోసం రైతు సోదరులు తప్పనిసరిగా మీసేవ కేంద్రంకు వెళ్లేసి వెంటనే అప్లై చేసుకోండి. ఫార్మా ఐడి నమోదు చేయకపోతే రైతులకు 24వ విడుదల పీఎం కిసాన్ సొమ్ము పొందడానికి ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి.
రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి (PM Kisan) పథకాన్ని మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపారు. కొత్తగా ఈ పథకం కింద 3,15,614 కోట్లను కేటాయించారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా సంవత్సరానికి అర్హులైన రైతులకు అకౌంట్లోకి రూ.6000/- జమ చేస్తున్న సంగతి తెలిసినదే. అగ్రిస్ట్రాక్ ఫార్మర్ ఐడి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు పంట బీమా, ఇన్సూరెన్స్, ఎరువులు, సంక్షేమ పథకాలకు అగ్రిస్ట్రాక్ ఫార్మర్ ఐడి తప్పనిసరి కానున్నది. అందుకుగాను రైతులు https://apfr.agristack.gov.in/ వెబ్సైట్ ద్వారా లేదా మీ సేవ కేంద్రం ద్వారా తప్పనిసరిగా క్రియేట్ చేసుకోండి. ఎందుకు కావలసినటువంటి డాక్యుమెంట్ వివరాలు చూస్తున్నట్లయితే ఆధార్ కార్డు, పట్టాదారులు, పాస్ బుక్, బ్యాంకు ఖాతా వివరాలు & ఆధార్ లింక్ అయినా మొబైల్ నెంబరు తీసుకువెళ్లినట్లయితే Agristack Farmer ID క్రియేట్ చేసి ఇస్తారు. మీకు భవిష్యత్తులో పథకాలు పొందడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.


