ఇందిరమ్మ ఫ్లాట్లను లక్కీ డ్రా ద్వారా నెల 28 నుంచి 31 వరకు కేటాయింపు.. అర్హత అనర్హత జాబితా విడుదల.. Indiramma house scheme
Indiramma House Scheme 2026 flats will be allotted through lucky draw in the presence of eligible applicants : తెలంగాణలో హైదరాబాదులో CURE పరిధిలో 15 నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇండ్లకు ఈనెల 28 నుంచి లక్కీ డ్రా ద్వారా ప్లాట్లు కేటాయిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 28 నుంచి ఫ్లాట్లు కేటాయిస్తున్నారు. క్యూఆర్ పరిధిలో 15 నియోజకవర్గాలలో ఇంద్రమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి టెండర్లు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు ఈనెల 28 నుంచి 31 వరకు అర్హులైన దరఖాస్తులను సమక్షంలోనే లక్కీ డ్రా ద్వారా ఫ్లాట్లను కేటాయిస్తున్నారు. మంగళవారం సచివాలయంలో ఇంద్రమ్మ ఇళ్ల టవర్స్ పై హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమక్షంలో ఆయన మాట్లాడుతూ తొలి విడుదలలో ప్రయోగాత్మకంగా రూ. 807.40 నిర్మిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్ల కోసం 60,720 దరఖాస్తులు వచ్చాయి వాటిలో సుమారుగా పరిశీలించి 40,900 మంది అర్హులుగా, 19,820 మంది అనర్హులుగా గుర్తించినట్టు తెలిపారు. అనర్హుల కారణాలు దరఖాస్తు వారి https://tghb.telangana.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇందిరమ్మ ఫ్లాట్లను లక్కీ డ్రా ద్వారా నెల 28 నుంచి 31 వరకు ఈ క్రింద విధంగా నిర్వహిస్తున్నారు
•ఈ నెల 28న పాటిగడ్డ, కౌకూర్, కుల్సుంపుర & జల్పల్లి….
•29న బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, నందిముసలిగూడ & బండ్లగూడ..
•30న అంబర్‌పేటలోని సిటీ పోలీస్ లైన్, గాజుల రామారం, ఆర్అండ్ బీ క్వార్టర్స్, పోచారం & గడ్డి అన్నారం..
•31న రాయదుర్గం, మైలారేవ్పల్లి, కేపీ హెచ్బి కాలనీ, రెడ్ హెల్పర్స్ లో.. లక్కీడ్రా నిర్వహి స్తున్నాం.
•లక్కీ డ్రాలో ఎంపిక కాని దరఖాస్తుదారులకు వెంటనే రూ.10,000 ఈఎండి మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తున్నారు.
మరొక నాలుగు నియోజకవర్గాలలో క్యూఆర్ పరిధిలో కొత్తగా ఇంద్రమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలం ఎంపిక చేశారు ఒక్కొక్క నియోజకవర్గంలో 480 చొప్పున మొత్తం 1920 ఇళ్లను నిర్వహిస్తున్నారు. వీటి కోసం సెప్టెంబర్ మూడో తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం https://tghb.telangana.gov.in/ వెబ్ సైట్ ని విజిట్ చేయండి.


