10th పాసైన వారికి కుటుంబ సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు | AP Secondary Health/DCHS Contract/Out sourcing Vacancy Notification 2026 Apply Now

10th పాసైన వారికి కుటుంబ సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు | AP Secondary Health/DCHS Contract/Out sourcing Vacancy Notification 2026 Apply Now

AP Secondary Health/ DCHS Contract/Out sourcing opened applications for 15 vacancies on August 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సెకండరీ హెల్త్ డైరెక్టర్ లో వివిధ పారామెడికల్ మరియు సహాయక సిబ్బంది పోస్టులకు కాంట్రాక్ట్ / అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో నియామకం కొరకు నోటిఫికేషన్ నెం. 01/2026, తేదీ 17.08.2026 నుండి 31.08.2026 వరకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

అన్నమయ్య జిల్లా సెకండరీ హెల్త్ డైరెక్టర్/డిసిహెచ్ఎస్ వారి నియంత్రణలో ఉన్న అన్నమయ్య జిల్లా ఆరోగ్య సంస్థలలో కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు GDA / MNO/FNO & ఆఫీస్ సబ్ ఆర్డినేట్ వివిధ పారామెడికల్ మరియు సహాయక సిబ్బంది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు నమూనా 17/08/2026 ఉదయం 10:00 గంటల నుండి 31/08/2026 సాయంత్రం 05:30 గంటల వరకు పోర్టల్ (https://annamayya.ap.gov.in/) లో అందుబాటులో ఉంటుంది. 01 జులై 2026 నాటికి 18-42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నెల జీతం రూ.15,000-18,500/- మధ్యలో ఉంటుంది. విద్య అర్హత మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 

AP Secondary Health/DCHS Contract/Outsourcing basis Notification 2026 apply 15 Vacancy Overview :

సంస్థ పేరు :: ఏపీ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, సెకండరీ హెల్త్ డైరెక్టర్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు GDA / MNO/FNO & ఆఫీస్ సబ్ ఆర్డినేట్
మొత్తం పోస్టుల సంఖ్య ::15
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ పద్ధతిలో
వయోపరిమితి :: 18-42 సం||రాలు
విద్య అర్హత :: SSC/10వ తరగతి
నెల జీతం :: రూ.15,000-18,500/-
దరఖాస్తు ప్రారంభం :: 18.08.2026
దరఖాస్తుచివరి తేదీ :: 31.08.2026
అప్లికేషన్ మోడ్ :: https://annamayya.ap.gov.in/

»పోస్టుల వివరాలు:

•ఈ నోటిఫికేషన్ లో ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు GDA / MNO/FNO & ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం ఉద్యోగాలు 15 భర్తీ చేస్తున్నారు.

»విద్యా అర్హత ::

•గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC/10వ తరగతి లేదా దానికి సమానమైన తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఎస్.ఎస్.సి/10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్ అంతర్ విద్యా మండలి నిర్వహించే ల్యాబ్ అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు) లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఏదైనా ఇతర సంస్థ నుండి ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుండి III ప్లంబింగ్ ట్రేడ్/III ఫిట్టర్ ట్రేడ్/III మెకానిక్ ట్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.

»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో రూ.15,000-18,500/- మధ్య నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. 01.07.2026 నాటికి వయస్సును లెక్కిస్తారు. వర్తించే నిబంధనల ప్రకారం సడలింపులు ఈ క్రింది విధంగా ఉంటాయి:-

ఎ. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు.

బి. మాజీ సైనికులకు: సాయుధ దళాలలో సర్వీసు కాలానికి అదనంగా 03 (మూడు) సంవత్సరాలు.

సి. దివ్యాంగులకు: 10 (పది) సంవత్సరాలు

»దరఖాస్తు రుసుము: దరఖాస్తుదారు తప్పనిసరిగా దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కొరకు, జిల్లా ఆసుపత్రి సేవల కోఆర్డినేటర్ అన్నమయ్య పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి (అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అర్హులైతే, ప్రతి పోస్టుకు డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేసి, ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి) క్రింద ఇవ్వబడిన విధంగా;

ఎ) దరఖాస్తు రుసుము రూ. 500/-

బి) మినహాయింపు: దివ్యాంగులకు పై రుసుము నుండి మినహాయింపు ఉంది.

»ఎంపిక విధానం: 75% విద్య అర్హత పైన, 25% ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

»దరఖాస్తు విధానం : దరఖాస్తు నమూనా 17/08/2026 ఉదయం 10:00 గంటల నుండి 31/08/2026 సాయంత్రం 05:30 గంటల వరకు పోర్టల్ (https://annamayya.ap.gov.in/) లో అందుబాటులో ఉంటుంది.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ :: 17/08/2026 ఉదయం 10:00 గంటల నుండి

•ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ :: 31/08/2026 సాయంత్రం 05:30 గంటల వరకు

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *