డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త.. 3 లక్షల వరకు రుణం.. PMFME- శ్రీనిధి పథకం ప్రారంభం..
Andhra Pradesh Stree Nidhi Scheme for Self Help Group Women Under PMFME 2026 Latest News : ఆంధ్రప్రదేశ్లో శ్రీనిధి పేరుతో మరో కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు స్థాయి నుంచి పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ PMFME-స్త్రీనిధి పథకం ద్వారా 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అన్నారు. దీనికోసం ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME) శ్రీనిధి పథకాన్ని అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అర్హులైన డ్వాక్రా మహిళలకు మూడు లక్షల వరకు రుణం సదుపాయం ఇస్తున్నారు. వీటి ద్వారా పిండి పదార్థాలు, ఫ్రూట్స్ & స్నాక్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి సదుపాయం కల్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో శ్రీనిధి పథకం కూరగాయల, చిరుధాన్యాలు, ప్రాసెసింగ్ పండ్లు, పప్పులు, స్నాక్స్, పిండి పదార్థాలు & పచ్చళ్ళు స్థానిక ఆహార పదార్థాలు తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి జిల్లాలో సమైక్యను జిల్లా రిసోర్సెస్ ఆర్గనైజేషన్ పరిగణించి వారి ద్వారా ఆసక్తి సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకానికి సెలెక్ట్ అయిన వారికి మోడీ సర్కు సేకరణ ప్యాకింగ్ బ్రాండింగ్ మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వం తరఫున కల్పించడం జరుగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు తెలిపారు. మహిళలకు ఆర్థిక సహాయం కాకుండా వారి వ్యాపార విజయవంతం అయ్యే వరకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇలాంటి వ్యాపారాన్ని విస్తరించి మహిళలు పారిశ్రామికవేతల తయారు చేయాలని ముఖ్యమంత్రి లక్ష్యం.


