తెలంగాణ లో కొత్త పెన్షన్లపై బిగ్ అఫ్ డేట్… వాళ్లకు పెన్షన్ కట్.. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనన్నారు | Telangana Cheyutha Aasara Pension 2026
Telangana Cheyutha Aasara Pension August 15, 2026 Latest News : తెలంగాణలో కొత్త పెన్షన్ పంపిణీకి ముహూర్తం ఖరారు అయింది. అనర్హులైన వాళ్లకు పెన్షన్ కట్ చేస్తూ.. అర్హులైన వారికి కొత్తగా 2.50 లక్షల మందికి పెన్షన్ ఈనెల 15న ఇవ్వనన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈనెల 15న సుమారుగా 2.50 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ పంపిణీకి ముహూర్తం ఖరారు ఇచ్చేసింది. హైదరాబాదులో సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రుల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేస్తున్న అందజేస్తారని తెలుస్తుంది. కొత్తగా తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా బాధితులకూ పింఛన్లు ఇవ్వాలని మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. అర్హులు గుర్తించి ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఆగస్టు 15వ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా బాధ్యత కుటుంబాలకు ఉపశమ కలిగించుకు పెన్షన్ దోహదపడుతుందని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ మొదట ప్రాధాన్యత ఇస్తున్నారు.
దివ్యాంగులు చనిపోయిన వారి భార్యలకు తక్షణమే పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిపైగా అనర్హుల పెన్షన్ అందుకున్నట్లు ప్రభుత్వం గుర్తించి ఏళ్ళ క్రితమే చనిపోయిన వారి పేర్లపై డ్రా చేస్తున్న లైవ్ అతడికేషన్ ప్రాసెస్ ఆధారంగా తేల్చి వారికి పెన్షన్ తొలగించాలని, అలాగే అర్హత కలిగిన వారిని గుర్తించి వెంటనే పెన్షన్ ఇవ్వాలని భావిస్తుంది. పెన్షన్ కోసం 11 లక్షల దరఖాస్తు అందాయి. వాటిలో నుంచి ముందుగా దివ్యాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు & పేద వృద్ధులతో జాబితా రెడీ చేసి ముందుగా వారికి పెన్షన్ ఇవ్వాలని తెలియజేస్తున్నారు. అలాగే కొత్త తలసేమియా, సికిల్సెల్ ఎనిమియా బాధితులకు కూడా పెన్షన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ద్వారా వీరికి తెలంగాణ ప్రభుత్వం ప్రతినెల పెన్షన్ అందించినది. మీ ఉందో లేదో వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ రెవెన్యూ అధికారులు సంప్రదించండి.


