విద్యార్థులకు శుభవార్త.. అన్ని పోటీ పరీక్షల ఉచిత కోర్సులకు కోసం..వెంటనే దరఖాస్తు చేసుకోండి.. Telangana Bc Study Circle Free online courses
Telangana BC Study Circle Free online courses : విద్యార్థులకు భారీ శుభవార్త.. ఉచితంగా పోలీస్, RRB, SSC, బ్యాంకింగ్ గ్రూప్ 1, 2, 3, 4 నియామక పరీక్షల కోసం ఉచితంగా కోర్సులను అందిస్తున్నారు.

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహిస్తున్న ఐదు నెలల పాటు ఉచిత ఫౌండేషన్ కోర్సును ప్రవేశపెట్టినారు. ఇందుకు జిల్లాలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ గారు ప్రకటన చేశారు. ఇందులో ముఖ్యంగా గ్రూప్ 1, 2, 3 & 4, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) & పోలీస్ ఉద్యోగ పరీక్షలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కోర్స్ అందిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలలో చదివినా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన బిసి, ఎస్సీ, ఎస్టీ, ఈవిసి & అనాధలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఉచిత కోర్సులకు గాను ఈ నెల 25 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు జాబితా ఆగస్టు 18 ప్రకటిస్తారు. 25 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభం కావడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం https://tgbcstudycircle.cgg.gov.in/ అధికార వెబ్సైట్ని సంప్రదించండి మరియు కరీంనగర్ బిసి స్టడీ సర్కిల్ లో 8782268686 నేరుగా సంప్రదించండి.

🛑Telangana Bc Study Circle Apply Link Click Here

