ఏపీ రైతులకు భారీ శుభవార్త.. వడ్డీ లేని రుణము.. రైతులకు ఒక్కొక్కరికి రూ.50వేల లోన్ వెంటనే అప్లై చేసుకోండి | AP Tobacco Farmers Loan
AP Tobacco Farmers Rs. 50,000 Loan For Interest Free Loan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త.. 50,000 వరకు వడ్డీ లేని రుణాలు.. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే.
•ఏపీ ప్రభుత్వం పొగాకు రైతులకు భారీవరం 50,000/- ఆర్థిక సహాయం.
•వడ్డీ లేని రుణాలు, అసలు 50,000/- ను అమౌంట్ రెండు సంవత్సరాల్లో జమ చేయాలి.

ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతులకు రూ.50,000 లోన్ ఇచ్చేందుకు కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అని, రెండేళ్లలో చెల్లించవలసి ఉంటుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియా సమావేశంలో తెలిపారు. తొలి ఏడాది సగం అమౌంటు రెండో ఏడాది మిగిలిన అమౌంట్ చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ప్రతి రైతుకు ఇది వర్తిస్తుందని స్పష్టత చేశారు. దీంతో సుమారుగా 40 వేల మందికి లబ్ధి చేరుతుందని తెలియజేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో FCV పొగాకు రైతులకు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సహకార ప్యాకేజ్ ప్రకటించారు. వక్కు పొగాకు రైతుకు 50 వేల వరకు వడ్డీ లేని రుణాలతో పాటు తక్కువ గ్రేడ్ పొగాకు కిలో పది రూపాయలు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ రుణాలను రైతులు తక్షణమే చెల్లించిన అవసరం లేదు 2027-28 మరియు 2028-29 ఆర్థిక సంవత్సరంలో పంట అమ్మిన రాబడి తర్వాత రెండో వాయిదాలు చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కిలో గ్రామకు 10 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. రాష్ట్రంలోని పొగాకు రైతులకు రూ.250 కోట్లు కేంద్రం రుణాలు సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు.


