Big Update : 7437 పోలీసు ఉద్యోగాలకు.. ఫీజు మరియు అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు | Telangana constable
Telangana constable jobs important dates and application fees details : తెలంగాణలో నిరుద్యోగులకు బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 7437 ఎస్సై, కానిస్టేబుల్, ఫైర్ & జైలు శాఖ ఉద్యోగాలకు అప్లికేషన్ డేట్ వచ్చేసాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7437 పోలీసు ఉద్యోగాలకు ఈనెల 19 ఆగస్టు ఉదయం 8 గంటల నుంచి 9 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటించారు. పోస్టులను అనుసరించి అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.600 నుంచి రూ.750 మధ్యలో ఉంది. ఇతర అభ్యర్థులకు రూ.1500 ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.50/-, ఇతర అభ్యర్థులు రూ.100/- చొప్పున మినహాయింపు ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా 7,437 పోలీసు ఉద్యోగులకు SC, ST, BC & EWS అభ్యర్థులకు అన్ని కలిపి 18 to 32 సంవత్సరాలు ఇతర అభ్యర్థులకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది. కేవలం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి ₹24,280 to ₹1,12,510/- మధ్యలో నెల జీతం ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్లైన్ లో https://www.tgprb.in/ అప్లై చేసుకోండి.


