LPG Cylinder : గుడ్ న్యూస్…భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
Commercial LPG cylinder price reduced : పక్షిమాసియా యుద్ధం వేళ భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు క్రమంగా తగ్గుతూ రూ.206 రూపాయలు తగ్గిస్తున్నారని కేంద్రం ప్రకటించారు. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం భారీ శుభవార్త తెలియజేశారు.

•గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త.
•రూ.206/- తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధరలు.
•హోటల్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు & చిన్న చిన్న వ్యాపారస్తులకు భారీగా తగ్గిన సిలిండర్ ధరలు.
భారతదేశంలో ఒకటి ఆగస్టు నుంచి 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా తగ్గించడం జరిగింది. ఈవేళ హైదరాబాదులో 19 కేజీల సిలిండర్ పై 206 తగ్గించి ప్రస్తుతం గ్యాస్ బండ ధర రూ. 2985 కి చేరింది. అలాగే ఢిల్లీలో 202 కలకత్తాలో 209 మేరకు తగ్గించారు. అయితే మాత్రం డొమెస్టిక్ సిలిండర్ ధర ఎలాంటి మార్పులు లేవని తెలిపారు. దీంతో హోస్టల్ లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలకు & చిన్న వ్యాపారస్తులకు ఈ తగ్గింపుతో ఉపశయం కలుగుతుంది. గల్ఫ్ దేశాల కంటే రష్యా మరియు అమెరికా లాంటి ఇతర దేశాల నుంచి చమురు ఎక్కువగా దిగుమతులు చేయడంతో సప్లై స్థిరంగా ఉండటంతో ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపారు.
రెస్టారెంట్లు మరియు చిన్న వ్యాపారస్తులు రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో కూడా చాలా వరకు రేట్లు పెంచారు.. రేట్లు తగ్గడంతో వీటి పైన కూడా ప్రభావం పడుతుంది. ఈ కమర్షియల్ వినియోగదారులకు ఈ ధర తగ్గింపు 01 ఆగస్టు 2026 నాటికి అమలులో రానున్నది. 14.2 కిలోల LPG సిలిండర్ లో ఎలాంటి మార్పులు లేవని తెలియజేశారు.


