Family Register Certificate : ప్రభుత్వ పథకాలు, వివిధ సేవల పొందాలనుకుంటే.. ఫ్యామిలీ సర్టిఫికెట్ తప్పనిసరి.. ప్రక్రియ ప్రారంభం
Telangana Family Register Certificate 2026 Latest News : తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర పౌర సేవలను మరింత వేగవంతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు.

తెలంగాణలో ప్రభుత్వ పథకాలు మరియు వివిధ రకాల సేవలు పొందేందుకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ గారు స్వయంగా వెల్లడించారు. రాష్ట్రంలో పౌర సేవలు మరింత వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా వెల్లడించారు. ప్రజలు ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ సులువుగా పొందాలి అనుకుంటే స్థానిక తాసిల్దార్ అనగా MRO కార్యాలయ సమీపంలో మీ సేవ కేంద్రాల ద్వారా ఈ సర్టిఫికెట్లు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
అధికారికంగా ఈ సర్టిఫికెట్ లో అభ్యర్థుల వివరాలు, వారి కుటుంబ సభ్యుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు అధికారిక కుటుంబ సమాచారం కూడిన ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ ప్రభుత్వపరమైన అన్ని రకాల వివిధ శాఖలకు చోట్ల చెల్లుబాటు అవుతుందని డిప్యూటీ సీఎం గారు బట్టి గారు స్పష్టం చేశారు.


