Indiramma Illu 2026 : జనావాసాల్లోనే.. ఇంద్రమ్మ ఇల్లు అర్హత.. రిజర్వేషన్లు… ఎవరికి ఎంతంటే?
Indiramma Illu Reservations & Eligibility 2026 All Details Apply process : తెలంగాణలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలు పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సమీపంలో స్థలాలు గుర్తించి కేటాయించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. పని ప్రదేశాలకు సమీపంలోనే ఫ్లాట్లు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క ప్లాటు దాదాపుగా 528 చదరపు అడుగులు విస్తీర్ణంలో 400 చదరపు అడుగుల కార్పొరేషన్ ఏరియాలో నిర్మించాలని తెలిపారు. దీనికి నిర్మాణానికి దాదాపుగా 11 లక్షల ఖర్చు అవుతాయి.. ఇందులో ప్రభుత్వం ఐదు లక్షలు భారీ సబ్సిడీ అందిస్తుంది మిగిలిన ఆరు లక్షల లబ్ధిదారులు వాటా చెల్లించవలసి ఉంటుంది. తొలి దశలో 17 నియోజకవర్గాలలో 7,680 ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో ముఖ్యంగా రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, నాంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్‌పుర, అంబర్‌పేట, మేడ్చల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, మలక్‌పేట నియోజకవర్గాల్లో ప్రభుత్వం తొలివిడతలో ఇందిరమ్మ ఇళ్లను CURE లో నిర్మించనుంది. ORR లోపల ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ, రవాణాశాఖ స్థలాలను తీసుకొని వాటిని మరోచోట కేటాయిటాయించాలని తెలిపారు. ఆల్రెడీ ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తించినట్లు అధికారులు సీఎం గారికి వెల్లడించారు. CURE లో ఇంద్రమ్మ ఇళ్లలో కోసం దరఖాస్తు మీసేవ, వాట్సాప్ ద్వారా ప్రక్రియ ప్రారంభమైంది. ఇందిరమ్మ ఇళ్లను CURE లో ఆగస్టు 10 లోపు మీసేవ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోవాలి.
ఇందిరమ్మ ఇళ్లలో అర్హత CURE ఏరియాలలో 10 సంవత్సరాల పాటు నివాసం ఉండాలి. ORR, CURE ప్రాంతాలలో ఎక్కడ కూడా సొంత ఇల్లు ఉండకూడదు. వారి వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉండాలి. కుటుంబంలో ఒకరి దరఖాస్తు చేసుకోవాలి. తొలి విడుదలలో 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. అందులో ఎస్సీలకు 14%, బీసీలకు 16% అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు 10% ఎస్సీలకు 5% దివాన్గులకు 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మిగిలిన 50% జనరల్ కేటగిరీకి కేటాయించడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్లలో కోసం మీసేవ కేంద్రంలో లేదా వాట్సాప్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.


