Indiramma Houses Scheme : ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్త గా దరఖాస్తు ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి… కొత్త రూల్స్ ఇవే !
Indiramma Cure Housing Scheme 2026 Application Start New rules : క్యూర్ లో ఇండ్లు కోసం దరఖాస్తు కొత్తగా చేసుకోవాల్సిందే, మీసేవ & వాట్సాప్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని మంత్రి పొంగులేటి ప్రకటించారు. క్యూఆర్ పరిధిలో గతంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రకటించారు. మొదటి విడుదలలో లక్ష ఇండ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు బుధవారం గాంధీభవన్ లో జరిపిన ప్రజా ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొంటూ, ఇప్పుడు నిర్మించే ఇండ్లలో ఒక్కొక్క ప్లాట్ విలువ 40 లక్షల నుంచి కోటి దాకా ఉంటుందని తెలిపారు. మొత్తం 16 నియోజకవర్గాలలో ఈ టవర్స్ నిర్మిస్తున్నామని, ఇంటి స్థలంలో వాటా కూడా కల్పిస్తున్నామని తెలిపారు. క్యూర్ హైదరాబాద్ ORR ప్రాంతాలలో అర్హులైన కుటుంబాలకు 528 చదరపు అడుగుల బిల్డప్ ఏరియా ప్లాట్ ను అందిస్తుంది. అలాగే ప్రభుత్వం ఐదు లక్షల సబ్సిడీ, ల్యాండ్ కాస్ట్ ఫ్రీ తో పాటు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ 6 లక్షలు గా నిర్ణయించింది. CURE దరఖాస్తు కోసం ఆగస్టు 10 లోపల మీసేవ వెబ్సైటు లేదా మీసేవ వాట్సాప్ 8096958096 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CURE లోని కోర్ అర్బన్ రీజన్ ఎకనామిక్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత వివరాలు
•హైదరాబాద్ ప్రాంతాలలో గత 10 ఏళ్లకు నివసిస్తూ ఉండాలి.
•కుటుంబంలో ORR లేదా CURE ఏరియాలో ఇల్లు లేదా ఫ్లాట్లు యాజమాన్యం కలిగి ఉండకూడదు.
•కుటుంబ వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉండాలి.
•ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
•ఇంతకుముందు ఎలాంటి హౌసింగ్ బెనిఫిట్స్ తీసుకోకుండా ఉండాలి.
•తప్పుడు సమాచారం ఇస్తే రద్దు చేస్తారు.
•SC 14%, ST 5%, BC 16%, PH 5%, గవర్నమెంట్ ఉద్యోగులు, సనిటేషన్ వర్కర్లు 10% & మహిళలకు 30% రిజర్వేషన్ ఉంటుంది.
ఈ పథకం ముఖ్య ఉద్దేశం పేదల సొంత ఇల్లు కలను నెరవేర్చడం, ప్రభుత్వ భూములను వర్టికల్ డెవలప్మెంట్ ద్వారా వినియోగించి పారదర్శకంగా డిమాండ్ సర్వే ఎలిజిబులిటీ వెరిఫికేషన్ లాటరీ ఆధారంగా అలాట్మెంట్ చేస్తారు. మొదటి పేజీలో 7,680 ఫ్లాట్ ను నిర్మిస్తున్నారు. ఇది ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ భాగమైన పైలెట్ ప్రాజెక్టు అధికార వెబ్సైట్ https://tghousing.cgg.gov.in/ లేదా మీసేవ ద్వారా వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 8031335905, 040-24603575 టోల్ ఫ్రీ నెంబర్ను కాల్ చేసి తెలుసుకోవచ్చు.

హైదరాబాదులో (ORR లోపు) పట్టణాల్లోని తక్కువ ఆదాయ వర్గాలు (LIG) కోసం నిర్మించబోయే లక్ష ఫ్లాట్ల పథకానికి మంచి పేరు సూచిస్తే బంపర్ ఆఫర్ తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ప్రజలకు ముందుకు తీసుకొచ్చింది. ఉత్తమ పేరు తెలియజేసిన వారికి లక్ష రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. మీరు సూచించే వేరే ఈ ప్రాజెక్టుకు అధికారికంగా గుర్తింపు కాబోతుంది, ఇందుకు ఈ నెల 28 చివరి తేదీ. Instagramలో tghd.officialకి మెసేజ్ చేయండి.

