Indiramma Houses Scheme : నేటి నుంచి ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు ప్రారంభం.. కొత్త రూల్స్ ఇవే !
Indiramma Cure Housing Scheme 2026 Today Start Application New rules : తెలంగాణ ప్రభుత్వం.. పేద ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపారు.. హైడ్ లోని క్యూర్ అర్బన్ రీజన్ ఎకనామి (CURE) పరిధిలో నేటి నుంచి ఇంద్రమ్మ ఇండ్లకు స్కీమ్ కు దరఖాస్తులు ఆహ్వానం. ఇందులో కేటగిరి వారిగా కేటాయింపు చేశారు. SC లకు 14%, ST -5%, BC-16%, దివ్యాంగులకు -5%, ఔట్సోర్సింగ్, చిరు ఉద్యోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు 10% రిజర్వేషన్లు వర్తిస్తాయి. వీటిలోనూ మహిళలకు 30% కేటాయిస్తున్నారు. అలాగే మహిళల పేరంటే రిజర్వేషన్ చేస్తారు అప్లై చేసుకునే ప్రాంతాల్లో నివాసమై ఉండాలి.

క్యూర్ హైదరాబాద్ పరిధిలో నివసించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఈరోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. ఆగస్టు 10 వరకు మీసేవ ద్వారా అప్లై చేసుకోవాలి. తొలి విడుదలలో 16 నియోజకవర్గాలలో 500 చొప్పున ఎనిమిది వేల ఇల్లు నిర్మిస్తున్నారు. అర్హులు పదేళ్లగా క్యూర్ లో నివసిస్తూ ఉండాలి, ORR, CURE లో ఎక్కడైనా సొంత ఇల్లు ఉండకూడదు. వీరికి వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉండాలి. కుటుంబంలో ఒక అభ్యర్థి దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఇండ్లను 10 ఏళ్ల పాటు అమ్మకూడదు. అలాగే ఆర్థిక కూడా ఇవ్వకూడదు. అపార్ట్మెంట్ను నిర్మించి 528 Sft విస్తీర్ణ ప్లాట్లను కేటాయిస్తున్నారు. సొంత ఇల్లు అలాగే ఇల్లు స్థలం లేని వరకు ఈ పథకానికి అర్హులు.
ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తుకు అర్హత వివరాలు..
1. ORR, CURE ప్రాంతాలలో ఎక్కడ సొంతిల్లులు ఉండకూడదు.
2. దరఖాస్తుదారుల వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉండాలి.
3. పదేళ్లుగా క్యూర్ లో నివసిస్తూ ఉండాలి. కుటుంబంలో ఒకరి దరఖాస్తు చేసుకోవాలి.
4. అప్లికేషన్ ఈరోజు నుంచి ప్రారంభమై ఆగస్టు 10 లోపల మీసేవ ద్వారా వెంటనే అప్లై చేసుకోవాలి.
5.SC, ST, BC, దివ్యాంగులు ఔట్సోర్సింగ్ చిరు ఉద్యోగులు & పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
6. ముఖ్యంగా అప్లై చేసుకునే ప్రాంతాలలో నివాసమై ఉండాలి. తెలంగాణ ప్రజలై ఉండాలి.


