New Traffic Rules : మైనర్లకు వెహికల్ ఇస్తున్నారా? కొత్త రూల్స్ అమలు.. మీరు జైలుకెళ్లడం ఖాయం
Minor Driving New Traffic Rules 2026 Latest News : రాష్ట్ర రవాణా శాఖ మైనర్లకు వాహనాలు ఇచ్చి నడిపించే తల్లిదండ్రులకు హెచ్చరిక జారీ చేశారు. 18 సంవత్సరాల లోపు వారు వెహికల్ నడుపుతూ పట్టుపడితే, అ నేరానికి వాహన యజమాని లేదా సంరక్షకుని బాధ్యులుగా పరిగణిస్తారు. కొత్త రూల్స్ ప్రకారం శిక్షార్హులవుతారు. కాబట్టి పట్టుబడిన ఆ వాహన రిజిస్ట్రేషన్ 12 నెలల పాటు రద్దు అవుతుంది. వాహన నిబంధన గుల్లంగా కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో 4070 వాహనాల రిజిస్ట్రేషన్ రద్దయ్యాయి అన్ని తెలిపారు.

తల్లిదండ్రులకు హెచ్చరిక బజారుకు వెళ్లి రండి అని మైనర్ పిల్లలకు వాహనాలు (టు వీలర్ & ఫోర్ వీలర్) ఇస్తున్నారా.. మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహనా రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు బైక్ నడిపించే మైనర్ కి అబ్బాయి అయినా అమ్మాయి అయినా 25 సంవత్సరాల వచ్చేవరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయకూడదని క్లారిటీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రోడ్డు రవాణా శాఖ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తో పాటు ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూల్స్ కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. మైనరుకు వాహనం ఇచ్చిన తల్లిదండ్రులు లేదా యజమానులకు 25 వేల వరకు జరిమానా తో పాటు మూడు సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష పడి అవకాశం ఉంటుంది. కావున తల్లిదండ్రులు మరియు వాహన యజమానులు తప్పనిసరిగా గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలకు వాహనాలు తాళాలు ఇవ్వకుండా మైనర్ డ్రైవింగ్ ప్రమాదం అని భావించాలని సూచించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తల్లిదండ్రులు మరియు యాజమాన్యులు పిల్లలు భద్రతతో పాటు ప్రజల ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో మహిళలకు వాహనాలు ఇవ్వద్దని అధికారులు తెలిపారు. మోటర్ వాహన చట్టం ప్రకారం సెక్షన్ 199-ఏ 2019 సవరణ ప్రకారం మైనర్ పిల్లలకు వాహనాలు నడుపుతూ గుర్తిస్తే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మైనర్లు వాహనాలు నడపడం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యజమాని లేదా సంరక్షకులు ఎట్టి పరిస్థితిలో 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు వాహన తాళాలు ఇవ్వద్దని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

