SSC CGL 2026 : భారీ పోటీ.. ఒక పోస్ట్ కి 250 మంది అభ్యర్థులు.. అప్లికేషన్ కరెక్షన్ ప్రారంభం చివరి తేదీ ఇదే
SSC CGL 2026 Application Correction Window Open Edit Form Last Date : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) 2026 పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు SSC కీలక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు లో గ్రూప్ బి & గ్రూప్ సి ఉద్యోగుల భర్తీకి సంబంధించి విద్యార్థులు భారీగా అప్లై చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు ఇప్పటికీ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం అప్లికేషన్ కరప్షన్ విండో అధికారికంగా ఓపెన్ రాయడం జరిగింది. దరఖాస్తు సమయంలో జరిగిన పొరపాట్లను సవరించుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ జూలై 1 నుంచి జూలై 3 (రాత్రి 11:00 గంటల వరకు) వరకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థులకు చివరి సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ముందుగానే తమ దరఖాస్తులను వివరంగా పరిశీలించి అవసరమైతే మార్పులు చేసుకోవాలని SSC బోర్డు తెలిపారు.

ముఖ్యమైన వివరాలు
•మొత్తం పోస్టుల సంఖ్య : 12,256
•ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ : మే 21 నుంచి జూన్ 22 వరకు
•మొత్తం దరఖాస్తులు : 30.66 లక్షల పైగా
•ప్రతి పోస్టుకు సుమారుగా : 250 మంది అభ్యర్థులు పోటీ.
•సవరణ విండో : జూలై 1 నుంచి జూలై 3 వరకు (రాత్రి 11:00 గంటల వరకు)
•అప్లికేషన్ కరప్షన్ ఫీజు : మొదటిసారి సవరణకు 200/- రెండోసారి సవరణకు 500/-
SSC CGL సవరణ విండో : కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్, 2026 పరీక్షా ప్రకటనలో అర్హతను నిర్ధారించడానికి చివరి తేదీని కీలక తేదీగా పరిగణించిన సంబంధిత భాగం ఇప్పుడు కొత్త చివరి తేదీ అయిన 25.06.2026 ప్రకారం ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 26.06.2026 (రాత్రి 11:00 గంటలు). దీని ప్రకారం, ‘దరఖాస్తు ఫారం సవరణల విండో’ ఇప్పుడు 01.07.2026 నుండి 03.07.2026 (రాత్రి 11:00 గంటల వరకు) వరకు తెరిచి ఉంటుంది.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ 1ఎగ్జామ్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆన్లైన్లో కంప్యూటర్ ఆదారితంగా జరుగుతుంది. ఆ తర్వాత టైప్ 2 ఎగ్జామ్ డిసెంబర్ లో ఉంటుంది. అందులో ఎంపికైన పూర్తి తర్వాత ఆయా సంబంధిత విభాగాలలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పంపుతారు.
SSC CGL 2026 అప్లికేషన్ ఫామ్ ఎలా మార్పులు చేయాలి
•ముందుగా SSC అధికార వెబ్సైట్ని ఓపెన్ చేయండి.
•అందులో అభ్యర్థి రిజిస్టర్ ఐడి మరియు పాస్వర్డ్ లాగిన్ అవ్వాలి.
•ఆ తర్వాత అప్లికేషన్ కరప్షన్ లింక్ పై క్లిక్ చేయండి.
•అందులో వివరాలు ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే సవరించి, అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అప్లికేషన్ భవిష్యత్తు కోసం ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి.


