AP District Court Jobs : రాత పరీక్ష లేకుండా 7th, 10th అర్హతతో ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది
AP District Court Recruitment 2026 Latest Office Subordinate, Record Assistant & Typist Cum Assistant Notification Apply Now: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నంలో ఆఫీస్ సబార్డినేట్ & వాచ్మాన్ కం స్వీపర్, రికార్డ్ అసిస్టెంట్ & టైపిస్ట్ కం అసిస్టెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగముల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తు చేయవలసిన చివరి తేది : 24-6-2026 to 5pm లోపు అప్లై చేయాలి.

ఉద్యోగం పేరు
•ఆఫీస్ సబార్డినేట్ : 03
•వాచ్మాన్ కం స్వీపర్ : 01
•రికార్డ్ అసిస్టెంట్ : 02
•టైపిస్ట్ కం అసిస్టెంట్ : 01
విద్య అర్హత :
•ఆఫీస్ సబార్డినేట్ & వాచ్మాన్ కం స్వీపర్ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత.
•రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•టైపిస్ట్ కం అసిస్టెంట్ పోస్టుకు డిగ్రీ, ఇంగ్లీష్ టైపింగ్ పరిజ్ఞానం హయ్యర్, కంప్యూటర్.



జీతం : రూ.15,000/- to 18,000/- లు (అక్షరముల పదిహేను వేల రూపాయలు) (APCOS నియమ నిబంధనలు అనుసరించి).
వయస్సు : 18 సం. ల నుండి 42 సం.ల వరకు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి వారికి గరిష్ఠ నందు సడలింపు కలదు. కావున ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఈ ప్రకటనతో జత చేయ బడిన దరఖాస్తు నమూనా ప్రకారము వివరములతో పాటు ఈ క్రింద పేర్కొన్న ద్రువీకరణ పత్రాల నకళ్ళు జత పరచి తమ దరఖాస్తులను కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం కార్యాలయంలో నిర్ధారించిన తేదీ మరియు సమయం 24-6-2026 to 5pm లోపు రిజిష్టరు పోస్టు మరియు కొరియర్ ద్వారా సదరు అడ్రసు నకు చేరేలా పంపించాలి. వ్యక్తిగతంగా/నేరుగా దరఖాస్తులు స్వీకరించబడవు.
1. అర్హతల ధ్రువ పత్రాలు 2. కుల ధ్రువీకరణ పత్రము 3. రేషన్ కార్డు 4. ఆధార్ కార్డు 5. పని అనుభవం ధ్రువ పత్రము 6. ఇతర ధ్రువ పత్రాలు. ఆలస్యముగా అందిన దరఖాస్తులను తిరస్కరించబడును. అన్ని అర్హతలు గల అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యు తేది మరియు ధ్రువ పత్రాల పరిశీలన తేదీలు విడిగా తెలియ జేయబడును.
ఈ భర్తీ ప్రక్రియ జిల్లా కలక్టరు వారి అధ్యక్షతన గల APCOS-ఔట్ సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగును. కావున అభ్యర్థులు ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని కోరడ మైనది.
•దరఖాస్తు చేయవలసిన చివరి తేది : 24-6-2026 to 5pm.

🛑Office Subordinate Notification & Application Pdf Click Here
🛑Record Assistant Notification & Application Pdf Click Here
🛑Typist Cum Assistant Notification & Application Pdf Click Here
🛑 Official Website Click Here

